కశ్మీర్ లో ఉగ్రవాదుల టార్గెట్ అదే

Update: 2021-03-23 03:49 GMT
పాకిస్తాన్ సరిహద్దు నుంచి దేశంలోని నగదు ప్రవాహం ఆగిపోవడం ఇప్పుడు ఉగ్రవాదులు కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. కశ్మీర్ లో ఇప్పుడు బ్యాంకులు, ఏటీఎంలను టార్గెట్ చేశారు. వరుస దోపిడీలు కలకలం రేపుతున్నాయి.

జమ్మూకశ్మీర్ షోపియాన్ లో ఎస్బీఐ ఏటీఎంలో ఇవాళ దొంగతనం జరిగింది. చోరీ చేసిన సొమ్ము దాదాపు రూ.17 లక్షలని సమాచారం.

దొంగతనం అనంతరం దుండగులు ఏటీఎంను ధ్వంసం చేశారు. డబ్బు కోసం ఉగ్రవాదులెవరైనా ఇలాంటి చర్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తులో చేస్తున్నారు.

కశ్మీర్ లో ఈనెలలో జరిగిన మూడో బ్యాంక్ దొంగతనం ఇదీ.. ఇప్పటికే బారాముల్లా, శ్రీనగర్ లో రెండు గ్రామీణ బ్యాంకులు లూటీ చేశారు.

ప్రధానంగా ఉగ్రవాదులు తమ ఆర్థిక అవసరాలకు ఈ ఏటీఎంలు, బ్యాంకులు లూటీ చేస్తున్నారు. వరుసగా ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు.
Tags:    

Similar News