జగన్ కి ఏ రాజకీయ పార్టీకి లేని భారీ అడ్వాంటేజ్ ఒకటి ఉంది. అదే ఆయన అధికారంలో ఉండడం. అందుకే ఆయన 2024 ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ని ప్రవేశపెట్టే చాన్స్ ని అందుకోబోతున్నారు. అపర చాణక్యుడు చంద్రబాబు సహా ఎవరైనా తాము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని మాత్రమే చెప్పగలరు, జగన్ మాత్రం తాను ఏది అనుకుంటే అది చేయగలరు. ఆ విధంగా ఆయనకు 2023-24 బడ్జెట్ పూర్తి అవకాశం ఇస్తుంది.
ఒక విధంగా ఇది ఎన్నికల బడ్జెట్ గానే చెప్పుకోవాలి. జగన్ 2019లో అధికారంలోకి వచ్చాక జూన్ లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లగాయితూ ఇప్పటిదాకా వైసీపీ నుంచి వచ్చిన నాలుగు బడ్జెట్లు సంక్షేమానికే పెద్ద పీట వేశాయి. దాంతో అంతా వన్ సైడెడ్ గా సాగిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడిది అని అంతా విమర్శలు చేస్తూ వచ్చారు.
దాంతో అందరికీ తగిన సమాధానంగా జగన్ చివరాఖరు బడ్జెట్ లో మెరుపులు కురిపించబోతున్నారు అని అంటున్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా అభివృద్ధికే అంకితం అయ్యేలా ఉంటుంది అని అంటున్నారు. ఏపీలో కేవలం ఏడాది వ్యవధిలో ప్రగతి పనులు సాగడం కష్టమనే చెప్పాలి. కానీ ఫలానా ప్రాజెక్టు ఇన్నేసి నిధులు అంటూ బడ్జెట్ లో కేటాయింపులు చేసి చెప్పుకోవచ్చు. అదే విధంగా కొత్త వాటిని తెచ్చి మరీ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చూపించుకోవచ్చు.
ఏపీలో అభివృద్ధికి ఈ రోజుకు అయితే తెలుగుదేశం పేరు మాత్రమే వినిపిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు చేసిన ప్రయత్నాలే ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కొనసాగిస్తూ నిధులు కేటాయిస్తారా లేక అలా కాకుండా కొత్తగా తాము అనుకుంటున్న తీరున కొన్ని నగరాలను ఎంపిక చేసుకుని వాటికే అభివృద్ధి పేరిట కొత్త ప్రాజెక్టులతో బడ్జెట్ ని నింపుతారా అన్నది చూడాలి.
వైసీపీ కొత్త బడ్జెట్ కచ్చితంగా మూడు లక్షల కోట్ల దాకా ఈసారి ఉండవచ్చు అని అంటున్నారు. ఈ బడ్జెట్ లో సగానికి సగం అభివృద్ధికి అంకితం చేయడం ద్వారా తాము ఏపీని స్వర్ఘధామం చేద్దామని అనుకుంటున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాకు సంబంధించి కొన్ని కీలక ప్రాజెక్టులను టేకప్ చేయడంతో పాటు రాయలసీమ గోదావరి జిలలలను టచ్ చేస్తూ వైసీపీ అభివృద్ధి ప్రణాళిక ఉండబోతోంది అని అంటున్నారు.
ఇక ఎన్నికలు ముందుగా జరుగుతాయా లేక షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా అన్న దానిని బట్టి కూడా వైసీపీ సర్కార్ ఆఖరి బడ్జెట్ లో చిట్టా పద్దులు ఆధారపడి ఉన్నాయని అంటున్నరు. బడ్జెట్ లో అభివృద్ధి చూపించి ఎన్నికలకు వెళ్తే జనాలు పాజిటివ్ గా రియాక్ట్ అయి ఓట్లు వేస్తారా అన్నది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగానే చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.