శృంగారంలో పురుషులకు అదే పెద్ద సమస్యగా మారుతోందా?

Update: 2023-01-02 09:07 GMT
ఒక వ్యక్తి మిగతా విషయాల్లో కంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు అమితానందాన్ని పొందుతాడు. అందుకే ఈ క్రియ కోసం మగవారు సమయం కోసం ఎదురుచూస్తుంటారు. అయితే సెక్స్ సమయంలో కూడా కొన్ని సమస్యలు ఎదురైతే తీవ్ర నిరాశను కలిగిస్తాయి. వాటిని పరిస్కరించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. ముఖ్యంగా పురుషుల్లో శీఘ్రస్థలన సమస్య వేధిస్తూ ఉంటుంది. సెక్స్ లో ఎంతో ఎంజాయ్ చేయాలనుకున్న చాలా మంది శీఘ్రస్థలనంతో కుంగిపోతుంటారు. ఈ సమస్యతో మగవారికే కాకుండా తనతో శృంగారంలో పాల్గొన్న భాగస్వామి కూడా అసంతృప్తి చెందుతుంది. అయితే శీఘ్రస్థలన సమస్య నివారణకు ఏం చేయాలి..? అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

వైద్యుల నివేదికల ప్రకారం.. శృంగారం 5 నిమిషాల పాటు చేస్తే అధిక సంతోషాన్ని పొందుతారు. కానీ కొందరి మగవాళ్లలో వీర్యం వెంటనే పడిపోతుంది. సెక్స్ స్ట్రాట్ చేసిన నిమిషం లోపే.. లేదా పురుషాంగం యోనిలోకి వెళ్లి బయటకు వచ్చేసరికి వీర్యం పడిపోతుంది. వీర్యం పడిన తరువాత సెక్స్ లో పాల్గొనలేరు. ఆ తరువాత తృప్తి లేదన్న బాధ వేధిస్తూ ఉంటుంది. అయితే కొందరికి ఈ సమస్య అప్పుడప్పుడు ఉండొచ్చు. కానీ తరుచూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. అయితే ఇలా జరగడానికి కారణం ఏంటి..?

మద్యం ఎక్కువగా తీసుకోవడం.. మానసిక సమస్యలు.. ఎక్కువగా టెన్షన్ పడడం.. భయం.. ఒత్తిడి.. చిన్న వయసులోనే సెక్స్ లో పాల్గొనడం.. వంటి వాటివల్ల శీఘ్రస్థలనం అవుతుంది. రోజంతా ఒత్తిడితో ఉన్న వారు కాస్త రిలాక్స్ కాకుండా వెంటనే శృంగారంలో పాల్గొంటే వెంటనే వీర్యం పడిపోతుంది. సెక్స్ గురించి పదే పదే భయపడడం.. ఇతర అనారోగ్యాలతో బాధపడేవారిలోనూ ఈ సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్య తగ్గడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు.

శీఘ్రస్థలనం సమస్య ఉన్నవారు కండోమ్ లు వాడాలని అంటున్నారు. హైపర్ సెన్సిటీవిటి ఉన్న పురుషులు కండోమ్ వాడడం వల్ల వెంటనే వారి వీర్యం పడిపోదు. కాస్త సమయం తరువాత బయటకు వస్తుంది. మీరు సెక్స్ చేసేటప్పుడు వీర్యం పడుతుందని తెలిస్తే ఆ సమయంలో కాస్త గ్యాప్ ఇవ్వండి. అంటే 30 సెకన్ల పాటు సెక్స్ చేయకుండా వేరే దృష్టి పెట్టండి. దీంతో స్థలనం చేయాలనే కోరిక తగ్గుతుంది. ఆ తరువాత మళ్లీ శృంగారంలో పాల్గొంటే ఎక్కువ సేపు స్థలనం కాకుండా ఉంటుంది.

రొటీన్ సెక్స్ కాకుండా డిఫరెంట్ యాంగిల్ లో శృంగారం చేయండి. లైంగిక పొజిషన్స్ మార్చడం వల్ల చురుగ్గా సెక్స్ లో పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల పరుషాంగంలోని సున్నిత స్థానాలు ఎక్కువగా ప్రేరేపితం కావు. దాని వల్ల ఆలస్యంగా స్థలనం అవుతుంది. ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. అంతేకాకుండా భాగస్వామిని కూడా తృప్తి పరిచిన వారవుతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News