సంక్రాంతి రేస్ మరో వారంలో ప్రారంభం కాబోతోంది. ఈ రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు తొలి సారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` ముందుగా బరిలోకి దిగుతోంది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ సంక్రాంతికి జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. వారం ముందే పండగ వాతావరణాన్ని ఈ సినిమా తీసుకురాబోతోంది.
దాదాపు 14 భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ , ఎన్టీ ఆర్ తొలిసారి కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ కావడం... `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత జక్కన్న నుంని వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ మూవీ ప్రచారాన్ని రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేసి ఉత్తరాదిలోనూ భారీ క్రేజ్ ని తీసుకొచ్చారు.
ఈ సినిమా రిలీజైన వారం రోజుల వ్యవధిలో అంటే జనవరి 14న గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` విడుదల కాబోతోంది. దాదాపు ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. దీని ప్రచార పర్వాన్ని ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో స్టార్ట్ చేశారు. ఇదిలా వుంటే ఈ రెండు సినిమాలతో పాటు సంక్రాంతికి మా సినిమాని కూడా థియేటర్లలో కి దింపేస్తున్నానని కింగ్ నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.
జనవరి 12న విడుదల కావాల్సిన పవన్ స్టార్ `భీమ్లా నాయక్` రిలీజ్ వాయిదా పడటంతో ఆ స్థానంలో నాగార్జున తన `బంగార్రాజు`ని దించేస్తాడని, జనవరి 15నే ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం ఊపందుకుంది. సినిమా మొత్తం సిద్ధమైందని, ఇటీవల రిలీజ్ గురించి మరో వేదిక మీద మాట్లాడుకుందామని చెప్పిన నాగార్జున ఇప్పటి వరకు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో బంగార్రాజుకి ఇంకా క్లారిటీ రాలేదా? సినిమాని సంక్రాంతికి విడుదల చేయడం లేదా? అనే చర్చ మొదలైంది.
ఇంతకీ `బంగార్రాజు` రిలీజ్ సంక్రాంతికి వుందా? .. లేదా?.. అని అక్కినేని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పండగ సీజన్ మరో వారంలో మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటికీ `బంగార్రాజు` టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో జనవరి 15న రిలీజ్ కావడం కష్టమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 2016లో వచ్చిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రంలో నాగ్ కు జోడీగా రమ్య కృష్ణ, చైకి జోడీగా `బేబమ్మ` కృతిశెట్టి నటిస్తున్నారు. ప్రత్యేక గీతంలో `చిట్టి` ఫరియా అబ్దుల్లా మెస్మరైజ్ చేయబోతోంది.