ఆ టీడీపీ ఎమ్మెల్యే స‌డెన్ సైలెన్స్ వెన‌క ఆ నివేదికేనా ?

Update: 2021-06-29 00:30 GMT
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎవ‌రు ఎలాంటి ట‌ర్న్ అయినా తీసుకోవ‌చ్చు. కానీ, దీనికి కూడా కార‌ణాలు ఉంటాయి. ఒక్కొక్క‌సారి కార‌ణాలు లేకుండా కూడా నేత‌లు నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘ‌ట‌నే.. గుంటూరు జిల్లా రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే విష‌యంలో తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో గుర్తింపు కోసం త‌హ‌త‌హ‌లాడారు. కానీ, ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడుగా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో కంచుకోట లాంటి గుంటూరు జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఆయ‌న కూడా ఒక‌రు. ఆ ఇద్దిరిలో గిరి పార్టీ మారిపోగా.. ఇప్పుడు అన‌గాని ఒక్క‌రు మాత్ర‌మే జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు.

ఇక‌, ఇప్పుడు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉంది. వైసీపీలోకి రావాలంటూ..కొన్ని రోజులు ఒత్తిళ్లువ చ్చాయి. అయినా.. ఆయ‌న ఎక్క‌డా త‌ల వంచ‌లేదు. అన‌గాని పార్టీ మారిపోతున్నారంటూ జ‌రిగిన ప్ర‌చారం వెన‌క కూడా వైసీపీ వాళ్లే ఉన్నార‌ని ఆయ‌న ఖండించారు కూడా.. ! పైగా అసెంబ్లీలోను, ఇత‌ర‌త్రా... వేదిక‌ల‌పై వైసీపీ స‌ర్కారును టార్గె ట్ చేస్తూ.. తీవ్ర‌స్థాయిలోవిమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌ధాని ఉద్య‌మం విష‌యంలోనూ త‌న వాయిస్‌ను బ‌లంగానే వినిపించారు. అయితే. ఇది ఆరు నెల‌ల కింద‌టి ముచ్చ‌ట‌. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అన‌గాని ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వాయిస్ వినిపించ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆయ‌న దూరంగా ఉంటున్నారు.

దీనికి ఏమైంది? ఎందుకు అలా చేస్తున్నారు? అంటే.. ఓ చిన్న వార్నింగే.. ఆయ‌న‌ను ఇబ్బందుల్లోకి నెట్టిం దనే ప్ర‌చారం నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతోంది. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో గ‌త‌ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్వ‌హించిన కాంట్రాక్టులు, ఇత‌ర త్రా ప‌నుల్లో అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం నివేదిక తెప్పించుకుంది. అయితే.. ఈ అవినీతికి కార‌ణం ఎవ‌రు..?  ఎందుకు జ‌రిగింది.. అనే విష‌యాల‌పై విచార‌ణ చేయాల్సిన ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది.

ఒక కీల‌క నేత‌ను రంగంలోకి దింపి.. ఎమ్మెల్యే వ‌ద్ద‌కు పంపింద‌ని టాక్‌. క‌ట్ చేస్తే.. అప్ప‌టి నుంచి ఎమ్మెల్యే అన‌గాని సైలెంట్ అయిపోయారు. వాస్త‌వానికి ఆయ‌న‌పై మంచి పేరే ఉంది. కానీ.. నివేదిక విష‌యం వెలుగు చూడ‌గానే మాత్రం ఆయ‌న సైలెంట్ అయిపోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రిగిందో తెలియాలంటే..వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News