అమిత్ షా మీటింగ్ అందుకే క్యాన్సిల్ అయ్యిందా? ఇదేంది?

Update: 2021-03-16 12:43 GMT
బీజేపీకి గెలుపుపై ఉన్న ఒకే ఒక ఆశ పశ్చిమ బెంగాల్. అసోంలో కూడా పరిస్థితి అటూ ఇటూగానే ఉంది. ఈ క్రమంలోనే కమలదళం ఫుల్ ఫోకస్ ను బెంగాల్ పై పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ లో రెండు ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు.

తన ప్రసంగంలో అమిత్ షా ఝాడ్ గ్రామ్ రావాల్సింది. కానీ ఆయన హెలిక్యాప్టర్  పాడవడంతో వర్చువల్ ద్వారా ప్రసంగించాడు. ఇక అమిత్ షా ఝాడ్ గ్రామ్ ర్యాలీకి రాకపోవడాన్ని రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ ఒక పెద్ద ప్రచారాంశంగా మార్చుకుంది.

ఝాడ్ గ్రామ్ ర్యాలీకి జనాలు రాలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అమిత్ షా తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని తృణమూల్ ప్రతినిధి కృణాల్ ఘోష్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సైతం  ర్యాలీ ఫొటోలు, వీడియోలు షేర్ చేసి జనాలు లేకనే అమిత్ షా రాలేదని దెప్పిపొడిచారు.  బీజేపీ పతనం మొదలైందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్, టీఎంసీలు ట్వీట్లు చేయడమే కాదు.. ర్యాలీ జరిగిన ప్రాంతం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అమిత్ షా ర్యాలీకి జనాలు రాకనే రద్దు అయ్యిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీ పరువు పోయినట్టైంది.
Tags:    

Similar News