ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మారిపోయాయని సాధారణ ప్రజలతోపాటు విశ్లేషకులూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సద్విమర్శల స్థానంలో తిట్లు, బూతులు నిత్యకృత్యమయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఎంత బాగా తిడితే అంత గుర్తింపు వస్తుందన్నట్టు నేతలు వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కులాలను మధ్యలోకి లాగడం, కులం పేరుతో తిట్టడం సర్వసాధారణంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయారని చెప్పుకుంటున్న హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కమ్మ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బూతులు తిట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. విమర్శలు, గొడవలు ఉంటే వారికి వారు చూసుకోవాలి గానీ.. మధ్యలో కులాన్ని లాగడం ఏంటనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కమ్మ కుల సంఘాలు గోరంట్ల మాధవ్‌పై మండిపడ్డాయి. అనంతపురం జిల్లాలో మాధవ్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి.
ఈ నేపథ్యంలో గుంటూరులో ఆగస్టు 25న ఒక ఫంక్షన్ హాల్‌లో కమ్మ కుల సంఘాలన్నీ సమావేశమయ్యాయి. అన్ని కులాలను అక్కున చేర్చుకునే కమ్మ సామాజికవర్గంపై కొందరు పనిగట్టుకుని ఇటీవల కాలంలో విమర్శలు చేస్తున్నారని.. వీటిని సహించేది లేదని ఆ సామాజికవర్గ ప్రతినిధులు హెచ్చరించారు. పార్టీల పరంగా ఏమైనా తేడాలుంటే.. రాజకీయంగా చూసుకోవాలని.. అంతేకానీ మధ్యలో కులాన్ని లాగి విమర్శలు చేస్తే ఊరుకోబోమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కమ్మ సామాజికవర్గంపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కమ్మ సంఘాలు, ఎన్ఆర్ఐ సంఘాలు, ప్రపంచ కమ్మ సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని కమ్మ సంఘాలు కూడా వచ్చాయి.
ఈ సందర్భంగా ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ... 'అన్ని కులాల వారిని మేం సోదరులుగా భావిస్తాం. అటువంటి కమ్మ సామాజికవర్గంపై వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ తేల్చుకోవాలి. మధ్యలో కమ్మ సామాజికవర్గాన్ని ఎందుకు లాగుతున్నారు' అని మండిపడ్డారు.
తెలంగాణ కమ్మ సంఘం ఉపాధ్యక్షుడు బొడ్డు రవిశంకరరావు, ఏపీ కమ్మ సంఘం ప్రధాన కార్యదర్శి కనకమేడల శ్రీనివాస చక్రవర్తి, కర్ణాటక కమ్మ సంఘం కార్యదర్శి బూరుగుపల్లి శ్రీహర్ష మాట్లాడుతూ.. ఇకపై తమ జోలికి వస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.