కర్ణాటక రాష్ట్రంలోలో తలెత్తిన ‘హిజాబ్’ వివాదం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ‘కొందరు హిజాబ్ కావాలంటున్నారు.. మరికొందరు టోపీ ఉండాలంటున్నారు.. ఇంకొందరు ఏవేవో ఉండాలంటున్నారు..’ ఇది సమైక్య దేశమా..? లేక మతం, ఇతర ప్రాదిపదికన చీలిపోయిందా...? అని మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ బండారి వ్యాఖ్యానించారు. అటు సుప్రీం కోర్టు సైతం ఈ విషయంలో అప్పుడే జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇది జాతీయ సమస్య కాదని, అవసరమైనప్పుడు స్పందిస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ తెలిపారు.
గత కొన్ని రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో ‘హిజాబ్’ వివాదం ఉధృతమైంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ముస్లిం యువతులు తాము హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కావడంపై ప్రభుత్వం తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ముస్లిం యువతులు మాత్రం ఇది తమ హక్కు అని అందోళన చేశారు. దీనికి ప్రతిగా హిందూ మతానికి చెందిన యువతులు కాషాయ కండువాలతో నిరసన తెలిపారు. ర్యాలీలు తీసిన విద్యాసంస్థలకు కాషాయ కండువలతో వచ్చారు. దీంతో వివాదం దుమారం లేపింది.
ఈ వ్యవహారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఉధృతం కావడంతో వీరికి రాజకీయ పార్టీలు కూడా తోడయ్యాయి. అంతేకాకుండా పాకిస్తాన్ దేశానికి చెందిన వారు కూడా ఈ విషయంపై కామెంట్లు చేయడం ఆందోలన వాతావరణం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం యువతులు తాము హిజాబ్ ధరించి క్లాసులకు అటెంట్ అవుతామని, ఇది తమ హక్కుగా గుర్తించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ విషయంపై అప్పుడే క్లారిటీ ఇవ్వలేదు. కానీ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాల్పడాలని సూచించింది. కానీ తమిళనాడు రాష్ట్రంలోని దేవాలయాలల్లో డ్రెస్ కోడ్ పాటించేలా ఉత్తర్వులివ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో జస్టిస్ భండారి, జస్టిస్ డి. భరతచక్రవర్తి కూడిన ధర్మాసనం ముందు విచారించారు. ఈ సందర్భంగా భండారి స్పందించారు. భారతదేశం లౌకిక రాజ్యమని గుర్తించాలన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తే దేశం మత ప్రాదిపదికన విడిపోయిందా..? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1947 నాటి తమిళానాడు ఆలయ ప్రవేశ చట్టంలో హిందేయేతరులు ఆలయాలకు ప్రవేశించే అనుమతి లేదన్నారు. 1970లో హిందూయేతరులు కూడా ఆలయాల్లోకి ప్రవేశించేలా తీసుకొచ్చిన చట్టాన్ని 1972లో హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు.
అయితే అందుకు భిన్నంగా ఇతర మతస్తులు, విదేశీయులను ఆలయాల్లోకి అనుమతిస్తున్నారని అన్నారు. అయితే భక్తులు నిబంధనల ప్రకారం దుస్తులు ధరించాలని, తంజావూరు, మధురై తదితర ప్రధాన ఆలయాల్లోకి జీన్స్ ప్యాంట్, లుంగీలతో ఆలయాల్లోకి ప్రవేసిస్తున్నారని అన్నారు. అయితే ఇలా అవుతున్నందున ఇతర మతస్తులకు ఆలయాల్లోకి ప్రవేశం లేదంటూ ఆలయాల ప్రవేశ ద్వారం వద్ద ప్రకటనల బోర్టు పెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
పిటిషనర్ పదే పదే కోరడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులోవ్యక్తిగతం హాజరు కాకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. ధర్మాసనంతో తగువు పడవద్దని, సముచిత భాష ఉపయోగించాలని హితవు పలికింది. ఆగమ శాస్త్రంలో ధోవతులు మాత్రమే ధరించాలని చెప్పినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? అని ప్రశ్నించింది. అయితే పిటిషనర్ బదులిస్తూ ఆధారాలకు కొంత సమయం ఇవ్వాలని కోరింది.