భారత్ లో జాబ్ మార్కెట్ ఇప్పుడు ఇలా ఉందా?

Update: 2022-09-04 00:30 GMT
కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదు అన్నది పాపులర్ సినిమా డైలాగ్.  టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైనా ఉద్యోగం ఉంటుందన్నది సామెత. వివిధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిమాండ్ కలిగిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. ఈ మేరకు  లింక్డ్ ఇన్ తాజా నివేదిక అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం.. వారి కెరీర్ కు రక్షణ కల్పించే ఉద్దేశంతో ‘స్కిల్స్ ఎవల్యూషన్ 2022’ , ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్ 2022’ డేటాను లింక్డ్ ఇన్ విడుదల చేసింది.  వృద్ధి చెందుతున్న టాప్ 10 నైపుణ్యాలు, భవిష్యత్ నైపుణ్యాల వివరాలను తెలియజేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లో 25 శాతం మార్పు చోటుచేసుకుందని.. 2025 నాటికి 41 శాతం మార్పు చోటుచేసుకుందని తెలిపింది.

భారత్ లో మంచి ప్రావీణ్యం, నైపుణ్యం వారికి జాబ్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే లింక్డ్ ఇన్ లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అత్యధికంగా బిజినెస్ డెవలప్ మెంట్, , మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్. క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్ మేనేజ్ మెంట్, మైక్రోసాఫ్ట్ అజూర్, స్ప్రింగ్ బూట్ డిమాండ్ నైపుణ్యాలుగా ఉన్నాయి.

2015 నుంచి చూస్తే కార్పొరేట్ సేవల పరంగా నైపుణ్యాల్లో 41.6 శాతం మార్పు చోటుచేసుకుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో జీఎస్టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్ కమ్ ట్యాక్స్ కు సంబంధించి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. సాఫ్ట్ వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి ఆరు నైపుణ్యాలు కొత్తవే ఉన్నాయి.

ఇక మీడియాలోనూ అవకాశాలు పెరిగాయి. ఆన్ లైన్ లో వెబ్ కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా ఆప్టమైజింగ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. బ్యాకింగ్, హెల్త్ కేర్ రంగంలో నైపుణ్యాల పరంగా  డిమాండ్ ఉంది.

ఓవరాల్ గా చూస్తే కొత్తగా పుట్టుకొచ్చిన నైపుణ్యాలను అందిపుచ్చుకొని నేర్చుకున్న వారికే మార్కెట్లో డిమాండ్ ఉంది. వారికే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అత్యధిక జీతాలు ఇచ్చి పెద్దపీట వేస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News