షర్మిలకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ అందరి నోట నానుతున్నారు కొండా రాఘవరెడ్డి. తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాజన్న కుమార్తె షర్మిల వెంట కొండా ఉంటున్నారు. పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేసేందుకు లోటస్ పాండ్ కు వచ్చిన షర్మిల.. గత నెలలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశం నుంచి రాజన్న బిడ్డ తరఫున ప్రముఖంగా కనిపిస్తుంది ఆయన.
ఇటీవల తెలంగాణకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ పై కొండా చేసిన వ్యాఖ్యలపై ఆయనకు హెచ్చరికలు వస్తున్నాయట. తన వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ ను తాజాగా చూపించిన ఆయన.. రాష్ట్ర డీజీపీని కలిసి కంప్లైంట్ చేస్తానని చెబుతున్నారు. రేవంత్ పై తాను చేసిన ఘాటు విమర్శలపై ఆగ్రహంతోనే తనకీ బెదిరింపులు వస్తున్నట్లుగా ఆయన చెబుతున్నారు.
రేవంత్ సైన్యం పేరుతో తనపై భౌతికదాడులకు పాల్పడతామంటూ మెసేజ్ లు.. ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా ఆయన చెబుతున్నారు. ఆయనకు వచ్చినట్లుగా చెబుతున్న ఒక మెసేజ్ వైరల్ గా మారి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అందులో.. ‘‘నమస్తేకొండా రాఘవరెడ్డిగారు.. ఈ రోజు మీ ప్రెస్ మీట్ విన్నాం. పద్నాలుగేళ్లుగా రేవంత్ రెడ్డిగారు ప్రజల పక్షాన కొట్లాడుతున్న నాయకుడు . ప్రశ్నించే గొంతుగా ఆయన్ను ప్రజలు గెలిపించారు. అలాంటి నేతపై మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. మీరు నోరు అదుపులోకి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడొద్దు’’ అన్న సందేశం కొండాకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
తాను చేసిన విమర్శలపై తక్షణం క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో భౌతికదాడులకు దిగుతామని తనకు వార్నింగ్ ఇచ్చినట్లుగా కొండా రాఘవరెడ్డి చెబుతున్నారు. మరి.. ఈ వ్యవహారంపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.