గత మార్చిలో దేశంలోకి కరోనా ఎంటర్ అయ్యింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. అయితే ఇటీవల దేశంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కానీ ఇది తుఫాన్ ముందు ప్రశాంతత అని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కు అత్యంత అనువైన శీతాకాలంలో కరోనా రెండో వేవ్ మొదలవుతుందని.. జనాలంతా ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనాకు అత్యంత అనువైన కాలం శీతాకాలం. తేమ , శీతల పవనాలతో వైరస్ ఎక్కువగా విస్తరిస్తుంది.. దాని తీవ్రతను పెంచుతుంది. ఇప్పటికే ఫ్రాన్స్ లో రెండో వేవ్ మొదలై రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అక్కడ డిసెంబర్ వరకు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే తెలంగాణకు ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కరోనా రెండో వేర్ మొదలుకాబోతోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను హెచ్చరించడం సంచలనమైంది. తాజాగా తెలంగాణలో 1,504 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య గురువారం 2,35,656కు చేరుకోగా.. గత 24 గంటల్లో మరో ఐదు మరణాలు సంభవించాయి. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 1,324కు చేరుకున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరణాల రేటు జాతీయ సగటు 1.5 శాతానికి కంటే తక్కువగా తెలంగాణలో 0.56 శాతంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం.. 44.96 శాతం మరణాలు కోవిడ్ కారణంగా, 55.04 శాతం మరణాలు ఇతర వ్యాధులు ఉన్న వారికి ఈ వైరస్ సోకడం వల్ల వచ్చిన దుష్ప్రభావాల వల్ల చనిపోయారని తేలింది. రికవరీ రేటు జాతీయ సగటు 90.9 శాతంతో పోలిస్తే తెలంగాణలో 91.80 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు 17,979 యాక్టివ్ కేసులు ఉన్నాయి, ఇందులో 14,938 మంది హోం క్వారంటైన్ లోనే చికిత్స పొందుతున్నారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పడిపోయింది.గ్రేటర్ హైదరాబాద్, ఇతర జిల్లాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 288 కేసులు నమోదయ్యాయి. దాని పొరుగు జిల్లాలు మేడ్చల్ మల్కాజ్ గిరి , రంగారెడ్డిలలో వరుసగా 118, 115 కొత్త కేసులు... నల్గోండలో 93 కొత్త కేసులు నమోదయ్యాయి. తరువాత ఖమ్మం (84), భద్రాద్రి కొఠాగుడెం (83), సిద్దిపేట (73) ఉన్నాయి. గత 24 గంటల్లో 41,962 నమూనాలను పరీక్షించినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం మీడియా బులెటిన్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 41,96,958 కు పెరిగింది. మిలియన్ జనాభాకు పరీక్షించిన నమూనాలు కూడా 1,12,760 కి చేరుకున్నాయి.
శీతాకాలం రాష్ట్రంలో మొదలు కావడంతో ఇక కరోనా రెండో వేవ్ మొదలు కాబోతోందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ప్రజలు ప్రాథమిక భద్రతా మార్గదర్శకాలను విస్మరిస్తే వైరస్ తిరిగి పుంజుకోవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా తగ్గిపోయిందనే అభిప్రాయంతో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదని అధికారులు కోరారు. ప్రజలు జాగ్రత్తగా లేకపోతే రాష్ట్రం రెండో వేవ్ లో తీవ్రంగా దెబ్బతింటుందని వారు హెచ్చరించారు.
రాబోయే రెండు, మూడు నెలలు తెలంగాణకు కీలకమని.. ప్రజలు తమ రక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆరోగ్య అధికారులు కోరారు. మాస్కులు ధరించడం, శారీరక దూరం పాటించడం.. సామూహిక సమావేశాలకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రపరచడం వంటి భద్రతా మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని ప్రజారోగ్య డైరెక్టర్ జి.శ్రీనివాస రావు కోరారు. భద్రతా మార్గదర్శకాలను విస్మరిస్తే ఎంత డేంజరో.. రెండో వేవ్ కు గురైన అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల అనుభవాల నుండి ప్రజలు నేర్చుకోవాలని అధికారులు సూచించారు. వైరల్ జ్వరాల లక్షణాలతో ఉన్న వ్యక్తులు కోవిడ్ -19 పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.