ఉక్రెయిన్ లో రష్యా సైనికుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Update: 2022-03-19 05:09 GMT
ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రకటించి.. తన సత్తా చాటాలని తపించిన రష్యా అధినేత పుతిన్ ప్లాన్ అనుకున్నట్లుగా వర్కువుట్ కాలేదనే మాట వినిపిస్తోంది. రష్యన్ దళాలు ఉక్రెయిన్ కు చేరినంతనే.. తెల్ల జెండా ఎగురవేసి తమకు లొంగిపోతారని భావించారు. ఆ అంచనాలకు భిన్నంగా ఉక్రెయిన్లు వీరోచితంగా పోరాడుతున్న వైనంతో రష్యన్ సైనికుల పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారింది. అనుకున్న దానికి భిన్నమైన పరిస్థితులు ఉక్రెయిన్ లో ఉండటం.. తాము ఏ మాత్రం తయారీగా లేని పరిస్థితులు ఎదురుకావటంతో.. రష్యన్ సైనికుల మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదంటున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ లోకి దూసుకెళ్లిన రష్యన్ సైనికులు ఇప్పుడు ఉక్రెయిన్ గన్ల కోసం తెగ వెతుకుతున్నారట. కారణం తెలిస్తే.. నోట మాట రాదంతే. బెలారస్ కు చెందిన వార్తా సంస్థ వెల్లడించిన సంచన అంశాల్ని చూస్తే.. ఉక్రెయిన్ లో యుద్ధం చేస్తున్న రష్యన్ సైనికులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అయితే.. ఉక్రెయిన్ లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులకు తలొగ్గి తిరిగి రష్యాకు వెళ్లిపోతే పుతిన్ ప్రభుత్వం తమకు కఠినమైన శిక్షలు పడటం ఖాయమని భావించి.. అందుకు వారు కొత్త తరహా ఆలోచనల్ని చేస్తున్నారు. తాము ఉపయోగించిన ఏకే 74 గన్స్ లో 5.62 తూటాలు వాడతామని.. వాటిని కాకుండా ఉక్రెయిన్ సైనికులు ఉపయోగించే 7.62 తూటాల కోసం వెతుకుతున్నారు.

ఎందుకంటే.. ఆ తూటాలు దొరికితే.. వాటితో తమ కాళ్లపై కాల్చుకొని యుద్ధం నుంచి బయటపడాలన్నది వారి ప్లాన్ గా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆడియోక్లిప్ ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది.

ఇదే రీతిలో బయటకు వచ్చిన మరో ఆడియ్ో టేపులో.. రష్యా సైనికుడు ఒకరు తనకు ఎదురవుతున్న దారుణ అనుభవాల్ని వెల్లడించారు. ఉక్రెయిన్ సైనికులు గడిచిన 14 రోజులుగా తమపై కాల్పులు జరుపుతున్నారని.. తమకుచాలా భయంగా ఉందని వాపోయాడు.

తాము సాధారణ పౌరుల్ని చంపేస్తున్నామని.. ఇళ్లల్లోకి చొరబడి.. వారి ఆహారాన్ని దొంగలిస్తున్నామని రష్యన్ సైనికులు వాపోతున్నారు. చూస్తుంటే.. యుద్ధంమరిన్ని రోజులు సాగితే.. రష్యాకు చేదు అనుభవం ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.



Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News