డయాబెటిస్ ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ సురక్షితమా? నిపుణులు ఏమంటున్నారంటే..!
కరోనా మహమ్మారి ప్రస్తుతం రెండో దశలో ఉండి తన విశ్వరూపం చూపిస్తోంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య రెట్టింపు అయింది. వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా పంపిణీ చేశారు. ఇప్పుడు 45ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సిన్ పై ఇప్పటికీ చాలామందికి అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా ఇతర వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సిన్ పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఈ టీకా వేసుకోవచ్చా? వారికి సురక్షితమా? అనే అనుమానాలు లేకపోలేదు. వీటిపై నిపుణులు పలు సూచనలు చేశారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమేనని నిపుణులు అంటున్నారు. ఎలాంటి దుష్ర్భవాలు ఉండవని అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా అత్యవసరం అని సీడీసీ నొక్కి చెప్పింది. ఇక ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాధాన్యతను బట్టి మధుమేహం ఉన్నవారికి ఈ టీకాలు ఇస్తారు.
టీకా తొలి ప్రాధాన్యం ఎవరికి అనేది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రెల్ నిర్ణయిస్తుంది. ఈ మార్గదర్శకాలు ప్రస్తుత పరిస్థితులను బట్టీ మారుతుంటాయి. టైప్ 2 డయాబెటిస్, ఇతర దీర్ఘ కాలిక ఆరోగ్య సంబంధ సమస్యలు ఉన్నవారికి టీకా వేయాలని సీడీసీ నిర్ణయిస్తుందని నిపుణులు అంటున్నారు. టైప్ 1 డయాబెటిస్ ఎలాంటి ప్రాధాన్యత టీకాలు ఉండవని తెలిపారు. టీకా ప్రాధాన్యతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో టీకా ప్రాధాన్యత అంశానికి సంబంధించిన సమాచారం పొందవచ్చని సూచించారు.
మనం నివసించే ప్రదేశాన్ని బట్టి వ్యాక్సిన్ ఎక్కడ తీసుకోవచ్చో తెలుస్తుంది. స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి. ఆరోగ్య కార్యకర్తలను అడిగి టీకాకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. కొవిన్ యాప్ లో తొలుత నమోదు చేసుకున్న తర్వాత టీకా ఎప్పుడు వేస్తారో సెల్ ఫోన్ కే సమాచారం వస్తుంది.
మధుమేహంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్నా లేకున్నా వ్యాక్సిన్ అందరికీ ఉచితం. ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వమే పంపిణీ చేయాలని సీడీసీ నొక్కి చెప్పింది. శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారిని నిర్మూలించే బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉన్నందున.. ప్రభుత్వాలే దీనిని భరించాలని నిపుణులు అంటున్నారు.
మధమేహం ఉన్న వారికి వ్యాక్సిన్ పూర్తిగా ఉచితమని నిపుణులు సూచించారు. డయాబెటిస్ ఉన్నవారిపై కొవిడ్ తీవ్రంగా ప్రభావం చూపుతుందని వైద్యులు తెలిపారు. గతంలో మరణించిన వాళ్లలోనూ మధుమేహం ఉన్నవారే అధికంగా ఉన్నారని నిపుణులు అంటున్నారు. కాబట్టి వారికి వ్యాక్సిన్ అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్నవాళ్లకు టీకా తప్పనిసరి అని సీడీసీ ఇదివరకే స్పష్టం చేసింది. కాబట్టి మధుమేహం ఉన్న వారి కచ్చితంగా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.
మధుమేహ ఉన్నవారిలోనూ టీకా మంచి ఫలితాలు ఇచ్చిందని నిపుణులు వెల్లడించారు. కేవలం డయోబెటిస్ మాత్రమే కాకుండా ఇతర దీర్ఘకాలిక సంబంధ వ్యాధులు ఉన్నవారిలోని మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు. మధుమేహం ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి తొలుత వీరికి టీకా ఇవ్వాలని అమెరికా వంటి దేశాలు నిర్ణయించాయి. ఇక వ్యాక్సిన్లతో వారికి ఎలాంటి దుష్ప్రభావలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. నిర్భయంగా టీకా తీసుకొని మహమ్మారి కట్టడికి సహకరించాలని అంటున్నారు.