దేశ రాజధాని ఢిల్లీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతి స్వల్పకాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా, పంజాబ్‌లో భగవంత్‌సింగ్ మాన్ ఆప్ తరఫున సీఎంగా ఉన్నారు.
ఢిల్లీ, పంజాబ్‌లో విజయాల తర్వాత జాతీయ పార్టీగా ఎదగడానికి అరవింద్ కేజ్రీవాల్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. మెరుగైన ఓటింగ్ శాతాన్ని సాధించారు. ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లను ఆప్ దక్కించుకుంది.
ప్రస్తుతం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అయితే గుజరాత్‌లో మాత్రమే ఆప్ ఖాతా తెరిచింది. ఇక్కడ 8 సీట్లలో ఆప్ ఆధిక్యంలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆప్‌కు ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. ఇక్కడ ఒక్క చోట కూడా ఆప్ ఆధిక్యంలో లేదు.
ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి.. బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ).
ఏదైనా పార్టీ జాతీయ పార్టీగా అవతరించాలంటే మూడు వేర్వేరు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికల్లో 2 శాతం సీట్లు సాధించి ఉండాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది.. అలాగే నాలుగు ఎంపీ సీట్లలో విజయం తప్పనిసరి. అలాగే కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా ఉండి ఉండాలి.
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆప్.. ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉంది. గుజరాత్‌లో ప్రస్తుతం 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే గతంలో గోవాలో రెండు చోట్ల సీట్లు సాధించింది. జాతీయ పార్టీ హోదా కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాలను అయితే ఆప్ అధిగమించే చాన్సు ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో తొమ్మిదో జాతీయ పార్టీగా అవతరించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉండటం, గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించే అవకాశం ఉండటంతో జాతీయ పార్టీగా ఆప్ ఆవిర్భవించే అవకాశాలే ఎక్కువని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.