మ‌హా సంక్షోభానికి ఏపీలోనూ ఛాన్స్ ఉందా...!

Update: 2022-06-24 15:30 GMT
ఏపీకి పోరుగునే ఉన్న మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం తెర‌మీదికి వ‌చ్చింది. అక్క‌డి అధికార పార్టీ శివ‌సే న‌లోనే ముస‌లం పుట్టింది. సొంత పార్టీ నాయ‌కుడే.. అందునా.. రాజ‌కీయంగా ఓన‌మాలు నేర్చుకున్న ఏక‌నాథ్ షిండేనే.. త‌న‌కు రాజ‌కీయంగా భిక్ష పెట్టిన శివ‌సేన‌పై తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు. ఈ క్ర‌మంలో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే రాజీనామాకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే ఆయ‌న అధికార నివాసం వ‌దిలిపెట్టారు. అయితే.. దీనికి దారి తీసిన ప‌రిస్థితులు ఏంటి? అనేది ఆస‌క్తిగా ఉంది.

ఎందుకంటే.. మ‌హారాష్ట్రంలో రాజ‌కీయ ముసలం పుట్టేందుకు ఏ కార‌ణాలైతే.. ఉన్నాయో.. ఏపీలోనూ.. అవే కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఏపీలోనూ.. మ‌హారాష్ట్ర త‌ర‌హా ముస‌లం పుడుతుందా? అనేది టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ముందు మ‌హారాష్ట్ర విష‌యాన్ని చ‌ర్చిస్తే.. అక్క‌డ సీఎం ఉద్ధ‌వ్‌.. సొంత‌గా పార్టీనిఅధికారంలోకి తీసుకురాలేక పోయారు. అందుకే కాంగ్రెస్‌-ఎన్సీపీతో క‌లిసి స‌ర్కారును ఏర్పాటు చేసుకున్నారు. త‌న వారిని కూడా మంత్రుల‌ను చేసుకున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఎమ్మెల్యేల‌కు ఆయ‌న నిధులు ఇవ్వ‌డం లేదు. అదేస‌మ‌యంలో అభివృద్ధిని కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు. ఇక‌, క‌నీసం త‌మ క‌ష్టాలు చెప్పుకొందామంటే.. ఎమ్మెల్యేల‌కు సీఎంగా ఉద్ద‌వ్ క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేదు. ఈ అసంతృప్తి కార‌ణంగానే.. రెండున్న‌రేళ్లు భ‌రించిన ఎమ్మెల్యేలు.. 45 మంది తిరుగుబాటు నాయ‌కుడు షిండేకు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో ఏకంగా స‌ర్కారు ప‌త‌నం అంచుకు చేరిపోయింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంద‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఎమ్మెల్యేల‌కు నిధులు ఇవ్వ‌డం లేదు. క‌నీసం జ‌గ‌న్‌వారికి క‌ష్టాలు చెప్పుకొనే అవ‌కాశం కూడా క‌ల్పించ‌డం లేదు.

ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య వివాదాలు.. విభేదాలు కొన‌సాగుతున్నాయి. దీంతో పార్టీలోనేఅంత‌ర్గ‌త క‌ల‌హాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రోజుకో పంచాయ‌తీ తాడేప‌ల్లికి చేరుతోంది. దీంతో మ‌హారాష్ట్ర త‌ర‌హా వివాదం.. ఇక్క‌డ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంటుందా? అనే చ‌ర్చ జోరుగా తెర‌మీదికి వ‌చ్చింది.

కొస‌మెరుపు ఏంటంటే.. అక్క‌డ మూడు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ద‌రిమిలా.. శివ‌సేన‌కు సొంత బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌నే ప్ర‌చారం ఉంది. కానీ, ఏపీలో అలా జ‌రిగే అవ‌కాశం లేద‌ని.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నా.. తిరుగుబాటు జెండా ఎగ‌రేసే సత్తా లేద‌ని.. కాబ‌ట్టి.. మ‌హారాష్ట్ర త‌ర‌హా ప‌రిస్థితి ఏపీలో రాద‌ని అంటున్నారు. కానీ, ఎన్నిక‌ల నాటికి కూడా వైసీపీ అధినేత ఇలానే ఉంటే.. అప్పుడు మాత్రం నాయ‌కులు జంపింగుల బాట‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News