ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. వేర్వేరు రంగాల్లో అయితే దాన్ని ఏదోలా సాధించొచ్చు. కానీ.. రాజకీయ రంగంలో ఇలాంటివి మరింత కష్టం.. క్లిష్టం. అయినప్పటికీ తనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ.. వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన తీరును ఎంతలా అభిమానించే వారు ఉన్నారో.. అంతగానే వ్యతిరేకించే వారున్నారు. అయినప్పటికీ విజయం ఆయన సొంతం కావటానికి కారణం.. ఆయన గేమ్ ప్లాన్ మిగిలిన వారికి భిన్నంగా ఉండటమే.
పార్టీ.. ప్రభుత్వం ఇలా అన్నింటిలోనూ తనకు పూర్తిస్థాయి పట్టు వచ్చిన తర్వాత అందులో సెటిల్ కావటానికి.. ఆ పొజిషన్ ను ఎంజాయ్ చేయటానికి చాలామంది మొగ్గు చూపుతారు. కానీ.. జగన్ మాత్రం అందుకు భిన్నం. ఆయన ఎప్పుడు సవాళ్లను.. సమస్యల్ని కోరుకుంటారు. ఎందుకంటే.. ఇలాంటివి ఎన్నింటికి ఎదుర్కోగలిగితే.. అంతలా రాటుతేలతానన్న నమ్మకం. ఈ కారణంతోనే సీఎం కుర్చీలో కూర్చొని దాదాపు మూడేళ్లు అవుతున్నా.. పట్టుమని పది రోజులు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించదు. దీనికి కారణం.. ఆయన మైండ్ సెట్టే.
ఇలాంటిదే లేకుంటే.. మంత్రుల్ని మారుస్తానని చెప్పి..లేని వ్యతిరేకతను పెంచుకునేందుకు ఎందుకు నిర్ణయం తీసుకుంటారు? తొంభై శాతం మంత్రుల్ని మారుస్తానని చెప్పి.. లెక్కలు తనకు ఏ మాత్రం అనుకూలంగా లేవన్న విషయాల్లో కాస్తంత రాజీ పడి కేవలం 55 శాతం మంత్రుల్నే మార్చారు. దానికే ఎంత రచ్చ అయ్యిందో తెలిసిందే. అయినప్పటికీ తగ్గని ఆయన తాజాగా పార్టీ నేతల గ్రాఫ్ నుప్రస్తావించటం చూస్తే.. ఇదంతా పక్కా వ్యూహమన్న భావన కలుగుతోంది.
తాజాగా మంత్రులతో.. పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలతో.. జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ కావటం తెలిసిందే. గ్రాఫ్ సరిగా లేని మంత్రులు.. ఎమ్మెల్యేల బరువు తాను మోయలేనని.. అలాంటివారికి టికెట్లు ఇవ్వటం కుదరదని కుండబద్ధలు కొట్టేయటం వెనుక అసలు కారణంవేరే ఉంటుందని చెబుతున్నారు. ప్రజల్లో తమ గ్రాఫ్ బాగుందా? లేదా? అన్న విషయంపై ఎవరికి వారికి అవగాహన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తమ వ్యక్తిగత గ్రాఫ్ సరిగా లేకున్నా.. పార్టీ గ్రాఫ్ తో గెలిచేటోళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వారికి తన మాటలతో షాకిచ్చారు జగన్.
అయితే.. గ్రాఫ్ ప్రస్తావన వెనుక వైసీపీ అధినేత అసలు లెక్క వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. గ్రాఫ్ సరిగా లేని నేతలకు టికెట్లు ఇవ్వనని స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఆయన నోటి నుంచి మరో మాట కూడా వచ్చింది. తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థల్ని టార్గెట్ చేయాలని. అంటే.. ఇక నుంచి విపక్షంతోపాటు.. మీడియాను సైతం ఇష్టారాజ్యంగా తిట్టేయాలన్న సంకేతాన్ని జగన్ ఇచ్చినట్లే అవుతుంది. గ్రాఫ్ బాగోలేని నేతల్లో ఎవరైనా జగన్ తాజా మాటతో ప్రత్యామ్నాయ దారుల్ని వెతుక్కునే అవకాశం ఉంది. అలాంటి వారు విపక్షం మీదా.. వ్యతిరేక మీడియా మాత్రం మాటలు అనేందుకు తొందరపడరు.
జగన్ కు కావాల్సింది కూడా అదే. గ్రాఫ్ మాత్రమే కాదు.. విదేయత విషయంలోనూ ఎవరి లెక్క ఎంతన్న విషయాన్ని ట్రాక్ చేసేందుకు అనువుగా.. తాజా వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు. మరి.. అనుకున్నట్లుగా సీఎం జగన్ నేతల విధేయత గ్రామర్ ఎంతన్న విషయాన్ని సరిగా ట్రాక్ చేయగలుగుతారా? అన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.