సాగర్ లో జానారెడ్డికి ఇది ఘోర అవమానమే?

Update: 2021-05-02 09:46 GMT
నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి అంచున ఉన్నారు. టీఆర్ఎస్ కుర్ర అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమైంది. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాగర్ ఉప ఎన్నికల్లో బలమైన జానారెడ్డిని మట్టి కరిపించి సత్తా చాటింది. తగిన వ్యూహరచనతో కాంగ్రెస్ కురువృద్ధుడిని ఓడించింది.

ఇప్పటివరకు కౌంటింగ్ జరిగిన రౌండ్లలో ఒకటి రెండు రౌండ్లు మినహాయిస్తే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎక్కడా ఆధిక్యత సాధించలేదు. కొన్ని రౌండ్లు టీఆర్ఎస్ కు తక్కువ మెజార్టీ లభించినప్పటికీ  ఆ పార్టీకి మెజార్టీ మాత్రం కొనసాగుతూ వస్తోంది.

ఇక సాగర్ నియోజకవర్గంలోని జానారెడ్డి సొంత మండలం అనుములలోనూ ఆయన ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇక్కడ కూడా జానారెడ్డికి మెజార్టీ రాకపోవడం గమనార్హం.

నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. సాగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గం కావడం.. ఆయనే బరిలో ఉండడంతో పోటీ ప్రధానంగా కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే సాగింది.

దుబ్బాకలో టీఆర్ఎస్ కు షాకిచ్చిన బీజేపీ.. నాగార్జున సాగర్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
Tags:    

Similar News