రేవంత్ రెడ్డి.. ఫైర్ బ్రాండ్.. తెలంగాణలో ఆయన ఫ్యాన్స్ కొదమ సింహం అంటారు. తెలంగాణ మొత్తం మీద కేసీఆర్ తర్వాత అంతటి వాగ్ధాటి, మాటల తూటాలు పేల్చగల నేత.. కాంగ్రెస్ భావి సీఎంగా కూడా పేర్కొంటున్నారు. రేవంత్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెలంగాణ లో విపరీతంగానే ఉంటుంది. ఓ సెక్షన్ అయితే నెత్తిన పెట్టుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమైన రేవంత్ రెడ్డి ఏపీ, తెలంగాణ దాటితే అంతేనా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది..
రేవంత్ రెడ్డి తాజాగా అమెరికా వెళ్లారు. అక్కడ న్యూయార్క్ ఎయిర్ పోర్టు లో దిగారు. ఆయనను స్వాగతించడానికి, రేవంత్ వస్తున్నాడని కలవడానికి పట్టుమని పదిమంది కూడా అమెరికా లోని ప్రవాస భారతీయులు రాలేదంటే అతిశయోక్తి కాదు.. అమెరికా లో రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఆదరణ, అభిమానం లేదని ఈ ఘటనతో నిరూపితమైంది.. రేవంత్ వెంట న్యూయార్క్ ఏయిర్ పోర్టులో కేవలం 9 మంది మాత్రమే ఉన్నారంటే ఆయన పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
కేసీఆర్ ప్రత్యర్థులంతా ఆయనకు ధీటైన మగాడు రేవంత్ రెడ్డి అని ఇప్పటికీ నమ్ముతుంటారు. తెలంగాణలో హరీష్ రావు కు ఉన్నటివంటి వ్యక్తిగత ఇమేజ్ ను రేవంత్ రెడ్డి కూడా కాస్తో కూస్తో తెచ్చుకున్నాడు. అయితే అన్నింటికంటే ప్రధానమైన లోపమే రేవంత్ రెడ్డి క్రేజ్ తగ్గి పోవడానికి కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి చేసిన ‘ఓటుకు నోటు’ కేసు నుంచి ఆయనపై ఉన్న నమ్మకం, క్రేజ్ పడిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. ఏ ప్రజానేతకు అయిన ఓటమి అనేది అధ:పాతాళానికి తొక్కేస్తుంది. రేవంత్ ను అదే చేసింది. కేసీఆర్, హరీష్, నాటి వైఎస్, చంద్రబాబులు సైతం తమ కంచుకోటలైన నియోజకవర్గాల్లో ఓడిపోలేదు. కానీ రేవంత్ రెడ్డి తనకు పెట్టని కోట అయిన కొడంగల్ లో ఓడిపోయారు. ఒక పార్టీని, లేదా ప్రజలను నడిపించే నాయకుడు ముందు తనను తాను గెలవాలి.. ఇంట గెలిచి రచ్చ గెలిచిన వాడే నాయకుడంటారు.. రేవంత్ కొడంగల్ లో ఓడి పోవడంతో ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానం క్రేజ్ కూడా జనాల్లో తగ్గిపోయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక అవసరం ఉన్నా లేకున్నా కేసీఆర్ సహా టీఆర్ఎస్ ను తిట్టడం కూడా రేవంత్ రెడ్డికి మైనస్ గా మారింది. మొత్తంగా భావి నాయకుడు అవుతాడనుకున్న రేవంత్ ఇప్పుడు మసక బారిపోతున్నారు. కనీస ప్రాధాన్యం, ఆదరణ, క్రేజ్ లేని నేతగా మిగిలిపోతున్నాడనడానికి అమెరికాలో రేవంత్ కు లభించిన స్వాగతమే చెప్పవచ్చు అంటున్నారు.. పట్టుమని 10 మంది కూడా స్వాగతించని రేవంత్ కు ఇంతకంటే అవమానం లేదని ఎన్ఆర్ఐలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.