తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ వడివడిగా పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లభించింది. ఈ క్రమంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని కూడా ఇటీవల కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీకి జాతీయ స్థాయిలో పలు అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా నియమించారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పైన కేసీఆర్ దృష్టి సారించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ నడుస్తోంది. మీడియాలోనూ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ చాలాకాలంపాటు మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారిగా రాణించారు. పుణే మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో తోట చంద్రశేఖర్ ఆ పార్టీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలో చేరిన తోట చంద్రశేఖర్ ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో జనసేనలో చేరిన తోట చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ప్రస్తుతం ఆయన జనసేనలో ఉన్నారని చెబుతున్నప్పటికీ అంత క్రియాశీలకంగా లేరు. ఇటీవల ఆయన బీజేపీలో చేరతారని.. వైసీపీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. అయితే బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు ఇస్తామని కేసీఆర్ నుంచి ఆఫర్ వచ్చిందని.. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్‌ఎస్ లో చేరుతున్నారని సమాచారం. తోట చంద్రశేఖర్ తోపాటు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు సైతం బీఆర్‌ఎస్ లో చేరతారని చెబుతున్నారు.
చేరిక అనంతరం ఆంధ్రప్రదేశ్ బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జనవరి 2న తోట బీఆర్‌ఎస్ లో చేరతారని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ సమక్షంలోనే తోట చంద్రశేఖర్ ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి.
కాగా, ప్రస్తుతం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల కిశోర్ బాబు కూడా ఇదే కార్యక్రమంలో పార్టీలో చేరతారని అంటున్నారు. అలాగే ఐఆర్‌ఎస్ మాజీ అధికారి చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్‌తో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరతారని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.