బీజేపీ అగ్ర నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడో అయిపోయిన వ్యవహారాన్ని ఇపుడు ఎందుకు కెలుక్కుంటున్నారో అర్థం కావటం లేదు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన అడ్డుగోలుగా జరిగిందని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చాలాసార్లే మొత్తుకున్నారు. సరే ఎలా జరిగినా విభజన జరిగిపోయిందని చెప్పి సమైక్య రాష్ట్రాన్ని రెండుగా విడదీసేశారు. ఏపీ అభివృద్ధిని సర్వనాశనం చేసేశారు.
అడ్డుగోలు రాష్ట్ర విభజనలో, ఏపీ నాశనంలో కాంగ్రెస్+బీజేపీ రెండు పార్టీలకు పాత్రుంది. అందుకనే రెండు పార్టీలు ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. విభజన జరిగిపోయిన తర్వాత చేసేదేమీ లేదు కాబట్టి ఎవరి మానాన వాళ్ళు బతుకుతున్నారు. జస్ట్ 8 ఏళ్ళ క్రితమే జరిగింది కాబట్టి విభజన సమయంలో ఏమి జరిగిందో అందరికీ బాగానే గుర్తుంది. సీన్ కట్ చేస్తే అప్పటి విషయాలను ఇపుడు పార్లమెంటులో ఎందుకు బీజేపీ అగ్రనేతలు లేవనెత్తుతున్నారో అర్ధం కావటం లేదు.
ఐదు రోజుల క్రితమే పార్లమెంటులో అసందర్భంగా నరేంద్ర మోడీ దాదాపు గంటసేపు ప్రస్తావించారు. విభజన అడ్డుగోలుగా జరిగిందని, ఏపీ బాగా నష్టపోయిందని చెప్పారు. మరి నిజంగానే ఏపీపై మోడీకి అంత సానుభూతే ఉంటే గడచిన ఎనిమిదేళ్లుగా మోడీ ఎందుకు అభివృద్ధికి చేయూత ఇవ్వడం లేదు. విభజన హామీలను ఎందుకు తుంగలో తొక్కేశారు ? మోడీ విషయాన్ని పక్కన పెట్టేస్తే తాజాగా అదే అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రస్తావించారు.
మోడీనే అనవసరంగా మాట్లాడారని అనుకుంటుంటే ఇపుడు అమిత్ షా కూడా అదే పని చేశారు. పార్లమెంటులో అనవసరంగా మాట్లాడటం వల్ల తెలంగాణలో పార్టీకి ఇబ్బంది అవుతోంది. ఇదే సమయంలో ఏపీలో జనాలకు మంటగా ఉంది. చేసేది లేదు పెట్టేది లేదు కానీ అనవసరంగా పుండును కెలుకుతున్నారంటు ఏపీ జనాలు కూడా మండుతున్నారు. మరి ఈ విషయాన్ని మోదీ, షా లు ఆలోచించటం లేదా ? లేకపోతే ఇంకేదన్నా వ్యూహముందా ?