రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం అంతకంతకూ ముదరటం.. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తోచిన మేరకు మసాలా దట్టించే మాటల్ని వదలటంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కేలా చేస్తోంది. ఇప్పటికే ఉన్న జల ఒప్పందాలన్ని తూచ్.. ఇవాల్టి నుంచి మేం చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడటం విస్మయానికి గురి చేస్తోంది. అంతేకాదు.. నీటి వాటాల్ని ఏకాఏకిన తేల్చేసి.. ఇక నుంచి ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఇవ్వాల్సిందేనంటూ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చిన వైనం రెండు రాష్ట్రాల మధ్య కాక రేపుతోంది.
కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు.. వినిపిస్తున్న వాదనలకు ధీటుగా తమ వాదనను ఏపీ సర్కారు వినిపించటం లేదన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది. కేవలం రాజకీయ కోణంలో కేసీఆర్ జలవివాదాన్ని హైలెట్ చేస్తున్న వేళ.. ఉత్తి పుణ్యానికే స్పందించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న మాట కొందరి నోటి నుంచి వినిపిస్తోంది. అంతేకాదు.. ఏపీకి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నందున వారి క్షేమాన్ని పరిగణలోకి తీసుకోవటం కూడా కీలమన్న మాట వినిపిస్తోంది.
దీంతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించే సమయంలో జాగరూకత చాలా అవసరమన్న విషయాన్ని ఏపీ అధికారపక్షం గుర్తించింది. తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి సీన్లోకి వచ్చారు. ఏపీకి సంబంధించిన కీలక అంశం ఏం ఉన్నా సరే ఆయనే మాట్లాడటం తెలిసిందే. తాజాగా జల వివాదం మీదా ఆయన రాష్ట్ర ప్రభుత్వ గళాన్ని వినిపించాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.
క్రిష్ణా జలాల్ని కాపాడుకునే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో మాట్లాడాటానికైనా సిద్ధంగా ఉన్నారని స్పస్టం చేశారు. ఇదేమీ రెండు దేశాల మధ్య సమస్య కాదని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన అంశంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరో ఎవరినో రెచ్చడొగితే.. రెచ్చిపోయే మైండ్ సెట్ తమకు లేదన్నారు. అదే సమయంలో ఏపీ ప్రయోజనాల్నివదిలే ప్రసక్తి లేదన్నారు.
ఏపీకి చెందిన ఒక్క చుక్క నీటినీ వదులుకోవటానికి ఏపీ ప్రఉందని భుత్వం సిద్ధంగా లేదని తేల్చేసిన సజ్జల.. తమను అదే పనిగా విమర్శిస్తున్న వారికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. నదీ జలాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టమైన వైఖరి ఉందన్నారు. సజ్జల తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని.. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ గేమ్ కు తలొగ్గమన్న మాట వినిపిస్తుంది. గతంలో టెండర్లు పిలిచిన రాయలసీమ ప్రాజెక్టు మీద ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయటం వెనుక కేసీఆర్ ఆలోచనలు అందరికి తెలిసినవే. మొత్తంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా విసురుతున్న వలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిక్కేందుకు సిద్దంగా లేరన్న విషయాన్ని సజ్జల తన మాటలతో స్పస్టం చేశారని చెప్పాలి.