కేటీఆర్ పై కేసీఆర్ వారసత్వ ప్రణాళిక ఇదేనా?

Update: 2019-12-17 06:31 GMT
‘2020లో తెలంగాణ సీఎం కేటీఆర్ కాబోతున్నారు’ ఈ వార్త రెండు మూడు రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో, మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేటీఆర్ రాష్ట్రానికి సూపర్ సీఎం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ ఆలోచనల్లో కూడా కేటీఆర్ ను సీఎం చేయాలని ఉన్నా.. అంతకంటే ముందే ఆయనను రాజ్యాంగేతర తెలంగాణ శక్తిగా మార్చే ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

కేసీఆర్ పైకి సీఎం.. కేటీఆర్ తెరవెనుక సీఎం. ఇప్పుడు ఇదే ప్రణాళికను కేసీఆర్ అమలు చేయబోతున్నాడట.. ఇందుకోసం కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సలహామండలి’ ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రికి సలహా ఇస్తుంది. దీనికి కేటీఆర్ చైర్మన్ గా ఉంటారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా మన్మోహన్ ఏలుతున్నప్పుడు సోనియాగాంధీ నేతృత్వంలో జాతీయ సలహామండలిని ఏర్పాటు చేశారు. పైకి మన్మోహన్ పీఎం అయినా దేశాన్ని ఏలింది సోనియానే అన్న ప్రచారం జరిగింది.ప్రస్తుతం కేసీఆర్ దాన్నే తెరపైకి తీసుకొచ్చి తన కొడుకు కేటీఆర్ ను రెండో సీఎం చేయబోతున్నారని.. భవిష్యత్తు సీఎంగా చూపించబోతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ రాష్ట్ర సలహా మండలిలో చైర్మన్ గా కేటీఆర్, తన బంధువు, మాజీ ఎంపీ అయిన వినోద్ తోపాటు కేసీఆర్ సన్నిహితులే ఇందులో సభ్యులుగా ఉంటారని సమాచారం.

ఈ పరిణామంతో కేటీఆర్ కు ప్రభుత్వం, పార్టీపై తన పట్టును నిలుపుకుంటాడు. అదే సమయంలో కేసీఆర్ వారసత్వ ప్రణాళిక కూడా అమలులోకి వస్తుంది. కేటీఆర్ కిందే ఈ నాలుగేళ్ల పాలన ఉంటుంది. 2023 నాటికి పరిస్థితులను బట్టి కేటీఆర్ పట్టాభిషేకం జరగవచ్చనే చర్చ పాలిటిక్స్ లో జరుగుతోంది.
Tags:    

Similar News