రాహుల్ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఇదేనా?

Update: 2022-08-23 14:30 GMT
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో పాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగనున్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లు అధికారానికి దూరమై, పార్టీ కూడా బాగా వెనుకబడిపోయి, బీజేపీ, ప్రధాని మోదీ ప్రభ వెలుగుతున్న ఈ సమయంలో రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ కు జవజీవాలు కల్పిచడం ఖాయమనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి రాహుల్ పాదయాత్ర ప్రకటన చేసినప్పటిన నుంచే కాంగ్రెస్ పునరుజ్జీవం అనే వాదన తెరపైకి వచ్చింది. అందులోనూ మోదీ ఒంటెత్తు పోకడలతో విసిసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఇలాంటి సమయంలో రాహుల్ పాదయాత్ర నిర్ణయం సరైన ఎత్తుగడ అనే అభిప్రాయం వ్యక్తమైంది.

యాత్ర మొదలైతే ఆ నేతల జాబితాలో.. భారత దేశం మొత్తం యాత్ర సాగించిన నేతలు ఇప్పటివరకు కొందరే ఉన్నారు. బీజేపీ అగ్ర నేత ఎల్ కే ఆడ్వాణీ, మాజీ ప్రధాని చంద్రశేఖర్ వంటి వారు మాత్రమే భారత పర్యంతం యాత్రలు  
చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల విషయానికొస్తే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డే గుర్తొస్తారు. ఎర్రటి ఎండల్లోనూ ఆయన పాదయాత్ర సాగించిన తీరు, ప్రజలతో మమేకం అయిన తీరు అందరినీ కదిలించింది. అందుకనే 2004లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది.

ఇక ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఏపీలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన పాదయాత్రలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. అయితే, వీరి ముగ్గురి యాత్రలు ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలోనే సాగాయి. రాహుల్ పాదయాత్ర మాత్ర దేశం మొత్తం చుట్టేసే కార్యక్రమం.

రాహుల్ అడుగులేస్తే చూపంతా ఆయన వైపే  రాహుల్ గాంధీకి నాయకుడిగా అన్ని అర్హతలు ఉన్నాయి. దేశం కోసం తండ్రి, నానమ్మల బలిదానం ఎప్పటికీ గుర్తుండిపోయేదే. అయితే, రాహుల్ ఎందుకనో ఇప్పటివరకు పూర్తి స్థాయి
రాజకీయాలపై చూపు నిలపలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికితోడు అధ్యక్ష పదవిని వదులుకోవడం మరింత చర్చరేపింది. అయితే, ఇప్పుడు కనుక రాహుల్ పాదయాత్ర పేరిట అడుగులు వేస్తే జాతి మొత్తం ఆయన వైపు చూడడం ఖాయం. తద్వారా కాంగ్రెస్ పార్టీ కోలుకుని మళ్లీ అధికార పీఠానికి చేరువవనుంది.

యాత్ర ఇలాగేనా..? రాహుల్ పాదయాత్ర కశ్మీర్ నుంచి ప్రారంభమై ఢిల్లీని తాకుతూ.. జమ్ము, పఠాన్ కోఠ్ , అంబాలా, ఢిల్లీ, అల్వార్, దౌసా, కోటా, ఇండోర్, నాందేడ్, వికారాబాద్, రాయ్ చూర్, బళ్లారి, మైసూర్ , కొచ్చి, తిరువనంతపురం మీదుగా సాగి కన్యాకుమారిలో ముగుస్తుంది.
Tags:    

Similar News