సిద్ధూ హిడెన్ అజెండా ఇదేనా ?

Update: 2021-09-19 14:30 GMT
నవ్ జోత్ సింగ్ సిద్ధూ..పరిచయం అవసరం లేని పేరిది. కొద్ది నెలలుగా పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని గబ్బు పట్టించేస్తున్న వ్యక్తి.  ఇటు  అమరీందర్ ను  ఉన్నపుడు అమరీందర్ అటు అధిష్టానాన్ని ఏకకాలంలో రాచిరంపాన పెడుతున్న వ్యక్తి. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి బాగానే ఉన్నా తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కోల్పోతోంది. దీనికి ఏకైక కారణం సిద్ధూ అనే చెప్పాలి. అమరీందర్ తో సిద్ధూకి ఎక్కడ చెడిందో స్పష్టంగా తెలీకపోయినా మాజీ సీఎంను మాత్రం ప్రశాంతంగా నిద్రపోనివ్వటంలేదు, పనిచేసుకోనీయటంలేదు.

24 గంటలు తన వెనుక సిద్ధూ ఏమి గొయ్యిలు తవ్వుతున్నారో చూసుకోవటంతోనే మాజీ సీఎం పుణ్య కాలమంతా గడచిపోయింది. ఇలాంటి పరిస్దితితో విసిగిపోయి చివరకు ముఖ్యమంత్రిగా అమరీంద్ సింగ్ రాజీనామా చేసేశారు. అత్యవసరంగా సీఎల్పీ సమావేశం జరగబోతోంది. పరిస్దితులు చక్కదిద్దటానికే అత్యవసర సమావేశమని కొందరు చెబుతున్నారు. అదేంలేదు అమరీందర్ వారసుడిని ఎన్నుకునేందుకే అత్యవసర సమావేశమని మరికొందరు చెబుతున్నారు.

వచ్చే ఏడాది మార్చి ప్రాంతంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నది. ఈ నేపథ్యంలో సీఎంను మార్చడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అమరీందర్ పైన మరీ అంతగా బ్యాడ్ ఇమేజ్ ఏమీ లేదు. అధికార పార్టీ పైన జనాల్లో ఉండే మామూలు వ్యతిరేకత తప్ప ప్రత్యేకంగా  భయంకరమైన వ్యతిరేకత లేదట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షాలేవీ అమరీందర్ పై అవినీతి ఆరోపణలు చేయకపోయినా సొంత పార్టీ నేత, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూనే సీఎంకు వ్యతిరేకంగా నానా రచ్చ చేస్తున్నారు.

సిద్దూ దెబ్బకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో అనే డౌటు పెరిగిపోతోంది. సిద్ధూ ఇపుడీ కంపు ఎందుకు చేస్తున్నాడంటే వచ్చే ఎన్నికల్లో తమ వర్గానికి అత్యధికంగా టికెట్లు సాధించుకుని, గెలిపించుకుని సీఎం అయిపోదామని చూస్తున్నారట. తన వర్గానికి అత్యధిక టికెట్లు ఇప్పించుకునే టార్గెట్ తోనే ఇపుడు పీసీసీ అధ్యక్షుడైనట్లు పార్టీ నేతలే చెబుతున్నారు.

అమరీందర్ కన్నా తానే బలవంతుడనని ప్రచారం చేసుకోవటం ద్వారా మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని తన గిప్పిట్లో ఇరికించుకోవాలనేది సిద్ధూ ప్లాన్ గా చెబుతున్నారు. అందుకనే అమరీందర్ కు వ్యతిరేంగా ఉన్న మంత్రులు, ఎంఎల్ఏలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. వారిద్వారా సతాయింపు మొదలుపెట్టారు. ఈ మొత్తంలో సిద్ధూ మరచిపోతున్నదేమంటే పార్టీతో పాటు ప్రభుత్వాన్ని తానే గబ్బు పట్టించేస్తున్నానని. ఇలాంటి చేష్టల వల్లే జనాల్లో కాంగ్రెస్ పార్టీ పలుచనైపోతోంది. చూద్దాం సీఎల్పీ సమావేశంలో ఏం జరుగుతుందో.
Tags:    

Similar News