తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో గంట గంట కి పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో దాదాపు 66 ఎకరాల భూమిని మంత్రి తమ నుంచి లాక్కున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద స్పందించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ భూ ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఇప్పటికే నివేదిక కూడా అందజేశారు. విజిలెన్స్ విచారణ సోమవారం పూర్తి కానుంది. విజిలెన్స్ విచారణ అనంతరం రాజేందర్ విషయంలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు సమాచారం.
ఇక విజిలెన్స్ విచారణ పూర్తి అయిన తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే భూ కబ్జాను నిర్ధారించడంతో ఆయనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కబ్జాతోపాటు బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు , అదే సమయంలో కబ్జా భూముల్లో ఉన్న చెట్లు నరికినందున ఫారెస్టు కన్జర్వేషన్ యాక్ట్, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం, అందులో నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు చేపట్టడంపై కూడా రాజేందర్‌పై కేసులు నమోదవుతాయని వార్తలు వెలువడుతున్నాయి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజేందర్ ఆస్తులపై ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలిసింది.
ప్పటికే మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆయన కొంత సైలంట్ గా ఉన్నాడు..రెండు రోజులుగా జరిగిన పరిణామాల తర్వాత స్వంత నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దీంతో పార్టీని వీడేందుకు ఆయన సిద్దమయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నట్టు సమాచారం. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యచరణపై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. కాగా భూ కబ్జా ఆరోపణల్లో రెండు రోజుల క్రితం స్పందించిన ఈటల ఇతర నేతలు, మంత్రులు అనేక కోట్ల రూపాయలు సంపాదించారని,వారికి లేని అభ్యంతరం నాపై ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. ఇందుకోసం ఆయన మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏయో అంశాలపై మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.