ఇవాల్టి టెండ్రీ వేర్ లో టైట్ జీన్స్ ఒకటి. అయితే.. ఇలాంటి వాటితో వచ్చే ముప్పు గురించి తెలిస్తే నోట మాట రాదు.టైట్ జీన్స్ ధరించిన 30 ఏళ్ల కుర్రాడికి ఎదురైన అనుభవం గురించి తెలిస్తే షాక్ తినక మానరు. ఢిల్లీకి చెందిన సౌరభ్ అనే వ్యక్తి తన స్నేహితులతో చేసిన జాలీ ట్రిప్ ఇప్పుడు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. దీనికి కారణం అతగాడు ధరించిన టైట్ జీన్స్ కారణమన్న వైద్యుల మాట అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే..
ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల సౌరభ్ తన ఆటోమేటిక్ కారులో (గేర్లు మార్చాల్సిన అవసరం లేని) తన ఫ్రెండ్ తో కలిసి రుషీకేష్ వెళ్లారు. కారులో ఎక్స్ లేటర్.. బ్రేక్ మాత్రమే వాడాల్సిన నేపథ్యంలో ఒక కాలితో ఆ పని చేశాడు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ప్రయాణంతో అతని కాలు తిమ్మిరి ఎక్కినట్లుగా అనిపించటం.. కాసేపటికే ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అప్పటివరకూ కులాశగా ఉన్న సౌరభ్.. అప్పటికప్పుడు అనారోగ్యానికి గురి కావటంతో అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతగాడ్ని పరీక్షించిన అక్కడి వైద్యులు ఆశ్చర్యకరమైన విషయాల్ని వెల్లడించారు. అతడికి గుండెపోటు వచ్చినట్లు చెప్పారు. అప్పటివరకూ బాగానే ఉన్న సౌరభ్ ఎందుకలా అయ్యిందన్న విషయం గురించి అడిగిన ప్రశ్నకు.. టైట్ జీన్స్ తో ఐదు గంటలకు పైనే ఎటూ కదలకుండా డ్రైవింగ్ చేస్తూ.. ఒక కాలునే వాడటంతో ఒక కాలుపై ఒత్తిడి పెరిగిందని.. అదే గుండెపోటుకు కారణంగా తేల్చారు వైద్యులు.
ట్రెండీగా ఉంటుందని ధరించే దుస్తులతో ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రయాణ సమయంలో బిగుతైన దుస్తులు ధరించి.. సరైన విశ్రాంతి తీసుకోకుండా ఉండటం ఏ మాత్రం సరికాదని వైద్యులు చెబుతున్నారు. తినే తిండే కాదు.. వేసుకునే బట్టలతోనూ అనారోగ్యానికి పాలవటం చూస్తే.. పాడు కాలమనిపించకమానదు.