తెలంగాణ లో దాదాపు 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు శుభం కార్డు పడనుందా? కీలక ప్రతిపాదనకు...ఇటు ప్రభుత్వం అటు కార్మికులు ఓకే చెప్పేయడం తో...నిర్ణయం వెలువడటమే ఆలస్యమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల కు మధ్య సయోధ్య కుదిర్చేందుకు.. సమ్మె వ్యవహారాన్ని హైపవర్ కమిటీ కి అప్పగించడం, దానికి ఇరు పక్షాలు అంగీకరించిన నేపథ్యం లో ఈ మేరకు ఓ అంచనా వెలువడుతోంది.
మా మాటకు, మా విశ్వాసానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు. ఈ వ్యవహారం లో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో లేబర్ కోర్టు మాట వింటుందన్న నమ్మకం కూడా మాకు లేదు. అయినా మా చివరి ప్రయత్నం చేస్తున్నాం అని హై కోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాలు, ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చల టేబుల్ వద్దకు తీసుకొస్తు న్నాం. ఇందుకోసం ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తుల తో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. వీరు వివిధ అంశాల్లో ఎంతో అనుభవం కలిగిన వారు. అత్యున్నత న్యాయ స్థానం లో రాజ్యాంగ హోదా లో పని చేశారు. ప్రభుత్వం కనీసం వీరి మాటైనా వింటుందని ఆశిస్తున్నాం. మా వైపు నుంచి చేస్తున్న చివరి ప్రయ త్నం ఇదే అని తెలిపింది.
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు హై కోర్టు కంటే అన్ని రకాలుగా యోగ్యత కలిగి ఉంటారని న్యాయస్థానం అభిప్రాయపడింది. 0.001 శాతం ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడానికి చిట్ట చివరిగా ఈ ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. దీనిపై అభిప్రాయం చెప్పాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను ధర్మాసనం కోరింది. ఈ అంశంపై తాను ప్రభుత్వం నుంచి సూచన తీసుకోవాలని, ఇప్పటికిప్పుడు అభిప్రాయం చెప్పలేనని ఏజీ పేర్కొన్నారు. ఇప్పుడే చెప్పాలని అనడం లేదని, ప్రభుత్వంతో చర్చించి బుధవారం అభిప్రాయం చెప్పాలని ధర్మాసనం సూచించింది.
ఒకసారి కమిటీ ఏర్పాటైన తర్వాత వారం రోజుల గడువిచ్చి, కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఇరు పక్షాలకు ఆదేశాలిస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయం లో ఇక పై విజ్ఞప్తులు ఏమీ ఉండవని, కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేస్తుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. హై కోర్టు లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఆసక్తికరమైన పరిణామాల నేపథ్యం లో.. బంతి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ కోర్టు లోకి వెళ్లింది. అయితే కమిటీకి ఒప్పుకుంటే తలొగ్గినట్లే అవుతుందని , ఒప్పుకోక పోతే కోర్టు లో వ్యతిరేకం గా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎం భావిస్తున్నారట ..దీనితో ఎర్రబస్సు ఎపిసోడ్ కు ఈ రోజు ఫుల్ స్టాప్ పడుతుందా లేక ఇంకా కొన్ని రోజులు కొనసాగబోతుందా అనేది సీఎం కేసీఆర్ నిర్ణయం పై ఆధారపడి ఉంది.