కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్న నానుడిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజం చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన ఇలాఖాలోనే ఓడించి కాంగ్రెస్ క్యాడర్ ను ఢీలా పడేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కు కంచుకోట అయిన హుజూర్ నగర్ ను కోల్పోవడం.. ఉత్తమ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ లో నిశ్శబ్ధకర వాతావరణం నెలకొంది. ఉత్తమ్ నాయకత్వ లోపాలను ఎత్తి చూపే చాన్స్ ప్రత్యర్థులకు దొరికింది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో ఓటమికి బాధ్యత వహించి ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఈరోజు ఢిల్లీ బాట పట్టాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లాడని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రానికి ఉత్తమ్ రాజీనామా చేశాడా లేదా అన్నది క్లారిటీ రానుంది.
హుజూర్ నగర్ ఫలితం చూశాక రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు గొప్ప చాన్స్ లభించినట్టైంది. పీసీసీ పీఠంపై కన్నేసిన రేవంత్.. ఎప్పుడైతే ఉత్తమ్ ఫెయిల్ అయిపోతాడో అప్పుడే తాను సమర్థుడిని అని నిరూపించుకునేందుకు రెడీగా ఉన్నట్టు పార్టీలో పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. టీపీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉత్తమ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది లేదు. పోయిన దఫా ఆయన సారథ్యంలోనే ఎన్నికలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లా పడింది.
ఇక గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలను కారెక్కకుండా నిలువరించడంలో కూడా ఉత్తమ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ రెండంకల స్కోరు సాధిస్తామన్న ఉత్తమ్ బీజేపీకి కంటే కూడా తక్కువ సీట్లు సాధించడం కాంగ్రెస్ వర్గాలను నైరాశ్యానికి గురిచేసింది.
ఇక అంతిమంగా తన సొంత సీటు, కంచుకోటను కూడా గులాబీ పార్టీకి కోల్పోవడంతో ఉత్తమ్ ప్రభ కాంగ్రెస్ లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. హుజూర్ నగర్ ఓటమితో ఇప్పటిదాకా ఉత్తమ్ ను సపోర్టు చేసిన వారు కూడా ఇప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చాలన్న డిమాండ్ ను లేవనెత్తడం ఖాయమన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ఉత్తమ్ కు సవాలుగా.. ప్రెస్టేజ్ ఇష్యూగా మారిన హుజూర్ నగర్ ఓటమితోనే ఉత్తమ్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. మరి టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ను కంటిన్యూ చేస్తారా? వరుస వైఫల్యాలను కారణంగా చూపుతూ ఉత్తమ్ ను సాగనంపుతారా అన్నది వేచిచూడాలి.