వల్లభనేని వంశీ అసలు ప్రజాప్రతినిధేనా?

Update: 2019-11-15 08:57 GMT
ఒక టీవీ చానల్ చర్చాకార్యక్రమంలో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడారు ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ మోహన్. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించుకున్న వంశీ, టీడీపీలోనే ఉన్న వీబీ రాజేంద్రప్రసాద్ ను ఎలా దూషించారో తెలిసిన సంగతే. అందుకు సంబంధించిన వీడియో వెబ్ లో వైరల్ గా మారింది కూడా. ఇలాంటి నేపథ్యంలో వంశీ తీరు పట్ల అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు వంశీ ఒక ప్రజాప్రతినిధేనా? అనే అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం.

పచ్చిబూతులు తిట్టాడు వంశీ. 'ఒంటి కన్నోడా..' అంటూ రాజేంద్రప్రసాద్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఈ ఎమ్మెల్యే. ఇక రాజేంద్రప్రసాద్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆయన కూడా వంశీని దూషించారు. అయితే ముందు మొదలుపెట్టింది, తీవ్రమైన పదాలను ప్రయోగించింది  వంశీనే.

రాజేందప్రసాద్ కూడా గతంలో కొన్ని సార్లు అనుచితమైన మాటలు మాట్లాడిన వ్యక్తే. వ్యక్తిగత విమర్శలు చేయడం, థర్డ్ గ్రేడ్ లో మాట్లాడటం రాజేంద్రప్రసాద్ కు కొత్త కాదు. ఆయన  గతంలో అలా మాట్లాడారు. అయినప్పటికీ వంశీ తీరు మాత్రం సమర్థనీయంగా లేదు.

చర్చాకార్యక్రమంలో కొంతైనా హుందాతనాన్ని ప్రదర్శించి ఉండాల్సింది. హుందాతనం లేకపోగా.. ఆ పై నీఛమైన మాటలతో వంశీ మాట్లాడారు. అందులోనూ ఆయన అయ్యప్ప మాల వేసుకుని, అలాంటి మాటలు మాట్లాడటం మరో విడ్డూరం.
Tags:    

Similar News