అక్రమాస్తుల కేసులకు సంబంధించి జగన్ తో పాటు మరికొందరికి రిలీఫ్ దొరికింది. వాన్ పిక్ భూముల వివాదానికి సంబంధించి అప్పట్లో సీబీఐ నమోదు చేసిన కేసును నిన్నటి వేళ తెలంగాణ కోర్టు కొట్టివేసింది.
అంతేకాదు నిమ్మగడ్డ ప్రసాద్ (కంపెనీ ఓనర్) కు వ్యతిరేకంగా నమోదు చేసిన ఏ అభియోగం కూడా సీబీఐ నిరూపించలేకపోయిందని, కనుక నాంపల్లి కోర్టులో ఇంతకాలం పెండింగ్ లో ఉన్న కేసును కొట్టివేస్తున్నామని, తమకున్న అధికారాన్ని వినియోగించి ఈ నిర్ణయం వెలువరిస్తున్నామని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ తీర్పు వెలువరించారు.
దీంతో ఇంతకాలం అభియోగాలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ ప్రసాద్ అండ్ కో కు, అదేవిధంగా వాన్ పిక్ ద్వారా ప్రయోజనాలు అందుకున్న కారణంగానే జగతి పబ్లికేషన్స్ లో డబ్బులు పెట్టారన్న ఆరోపణలకు కోర్టు ఎట్టకేలకు చెక్ పెట్టిందని సంబంధిత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.
కేసును ఎంపీ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డి సమర్థంగా వాదించడంతో సీబీఐ ఆరోపణలేవీ నిరూపణకు నోచుకోకపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు తెలంగాణ హై కోర్టులో ఉపశమనం లభించింది. 2016 నుంచి వాన్ పిక్ భూ వివాదం కొనసాగుతోంది. అప్పట్లో దాఖలైన ఈ కేసు కు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఫైల్ చేయడంలో సీబీఐ విఫలం అయిందన్న వాదనలు ఉన్నాయి.
దీంతో ఒక వ్యక్తి పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు తామెలా ఆదేశించగలమని ప్రధాన న్యాయమూర్తి నిన్నటి వేళ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇప్పటిదాకా ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టి వేయవచ్చు అని కూడా చెప్పారు. ఇది హై కోర్టుకు ఉన్న అధికారం దృష్ట్యా తీసుకుంటున్న నిర్ణయం అని తేల్చేశారు. దీంతో నిరంజన్ రెడ్డి వాదనలు నిలబడ్డాయి.
అదేవిధంగా నిందితుల విషయమై ఇప్పటిదాకా ఎటువంటి నిరూపణలూ చేయలేకపోయిన వైనంపై కూడా హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వాన్ పిక్ కంపెనీ చేసిన నేరాన్ని కంపెనీలో వ్యక్తులు చేసిన విధంగా బాధ్యులను చేయడం తగదని , నేరంలో సంబంధిత వ్యక్తులు బాధ్యులు అని నిరూపించగలిగితే, అటువంటి ఆధారాలుంటే తప్ప న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు వీల్లేదని కూడా తెలంగాణ హై కోర్టు తేల్చేసింది.