వైసీపీ గౌరవ అధ్యక్షురాలు(రాజీనామా చేస్తానని ప్రకటించారు) విజయమ్మ చేస్తున్నది త్యాగమా.. లేక రాజకీ యమా? ఇదీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న కీలక విషయం. ఎందుకంటే.. ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఆవెంటనే తాను షర్మిల కోసమే ఇలా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ రెండింటి మధ్య ఓ తల్లిగా తాను త్యాగం చేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఏ తల్లికీ.. ఇలాంటి బాధ రాకూడదని కూడా అన్నారు.
అంటే.. ఇప్పటి వరకు విజయమ్మ.. తాను ఇటు జగన్ కోసం.. అటు షర్మిల కోసం..త్యాగం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆమె చేసింది ఏంటి? అని పరిశీలిస్తే.. కేవలం రాజకీయమే. దీనిలో త్యాగం ఏమీ లేదని పరిశీలకులు చెబుతున్నారు.
త్యాగం చేసేందుకు విజయమ్మకు అవకాశం ఏం ఉందని అంటున్నా రు. గత ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేసేందుకు ప్రయత్నించి సాధించిన విజయమ్మ.. ఇప్పుడు పార్టీకి రిజైన్ చేయడాన్ని త్యాగం చేస్తున్నానని చెప్పడాన్ని తప్పుబడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో తన కుమార్తె షర్మిల విషయంలో సాయం చేసేందుకే తాను తెలంగాణకు వెళ్తున్నా నని చెప్పడం ద్వారా.. అక్కడకూడా రాజకీయాలు చేసేందుకేననే విషయం స్పష్టంగా తెలుస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీలోనే ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే.. అక్కడ షర్మిలను ఇప్పటి వరకు నమ్ముతున్నవారు కూడా నమ్మరనే విషయాన్ని గ్రహించి.. ఇప్పుడు వ్యూహాత్మకంగానే ఆమె రాజీనామా చేశారని చెబుతున్నారు.
పైగా.. కుమారుడు జగన్‌తో ఉన్న విభేదాలు.. చికాకుల కారణంగా.. పూర్తిగా వదిలించుకునేందుకు విజయమ్మ.. పార్టీని వదులుకుంటున్నారనే గుస గుస కూడా కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇలా.. ఇటు జగన్ నుంచి తలనొప్పులు వదిలించుకునేందుకు అటు..
షర్మిలకు ఇతోధికంగా సాయం చేసేందుకు వేసిన ప్లాన్ ప్రకారం.. ఆమె పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారని.. ఇందులో ఏదో పెద్ద త్యాగం ఉందని చెప్పడం అంటే.. ఇది కూడా సెంటిమెంటుతో వైఎస్ కుటుంబాన్ని ఆకట్టుకునేందుకేనని అంటున్నారు.