భారత స్పీడ్ బౌలర్ ఇషాంత్ శర్మ గ్రౌండ్ లో ఉన్నాడంటే గొడవకు కొదవలేదు. మైదానంలో ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేయాలంటే ఆస్ర్టేలియా టీంను కొట్టేసే వారు లేరు. అయితే మన ఇషాంత్ మాత్రం వారికి పోటీ వస్తాడనడంలో సందేహం లేదు. మైదానంలో ఆటకంటే కూడా ప్రత్యర్థులను కవ్వించడం..వారిపై మాటల దాడి చేయడంతోనే మనోడు ఎక్కువ పాపులర్ అయ్యాడు. తాజగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఇషాంత్ మరోసారి తన కవ్వింపు చర్యలతో వార్తల్లోకి ఎక్కాడు.
భారత ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శ్రీలంక బౌలర్ దమ్మిక ప్రసాద్ వరుసగా మూడు బౌన్సర్లు వేశాడు. అయితే కిందకు వంగి ఆ బౌన్సర్లను తప్పించుకున్న ఇషాంత్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. తాను బౌన్సర్ వేసినా ఇషాంత్ సిల్లీగా తీసుకోవడంతో ప్రసాద్ కు మండిపోయింది. తర్వాత బంతికి సింగిల్ తీసిన ఇషాంత్ ను ప్రసాద్ ఏదో తిట్టడంతో ఇషాంత్ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. కావాలంటే మరో బౌన్సర్ వేయి అన్నట్టుగా తన తలవైపు చూపించాడు.
వెంటనే సీన్ లోకి ఎంటర్ అయిన చండీమల్ అక్కడకు వచ్చి ఇషాంత్ పై ఫైర్ అయ్యాడు. మరో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్న అశ్విన్ తో పాటు అంపైర్లు సర్దిచెప్పారు. మళ్లీ ఇషాంత్ ను కవ్వించేందుకు బౌలర్ దమ్మిక ప్రసాద్ కావాలనే నో బాల్ వేశాడు. చివరి బాల్ కు అశ్విన్ అవుటై వెళ్లిపోతున్నప్పుడు మళ్లీ ప్రసాద్ ఇషాంత్ వద్దకు వచ్చి మరోసారి నోరు జారాడు.
అంత జరిగితే ఇషాంత్ బదులివ్వకుండా ఉంటాడా..తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ లో చండీమల్ అవుటై వెళుతుందే ఇషాంత్ మళ్లీ చేత్తో తన తలను కొట్టుకుంటూ వ్యంగ్యంగా సెటైర్ వేశాడు. దీంతో చండీమల్ చేసేదేమి లేక తల వంచుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఇషాంత్ తనకున్న గొడవ బాయ్ పేరును మరోసారి సార్థకం చేసుకున్నాడు.