వినేందుకే భయం కలిగించే విషయంగా దీన్ని చెప్పొచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో కొందరు రాక్షసులుగా మారిపోవటానికి ఇష్టంగా ఉండటమేకాదు.. మారణహోమాలు సృష్టించేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్న వైనం షాక్ తినిపించేదే. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో చేతులు కలిపేందుకు.. ఆ సంస్థలో చేరేందుకు దేశ వ్యాప్తంగా కొంతమంది సానుకూలంగా ఉంటున్న విషయాన్ని భద్రతా వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాల్ని సంపాదించాయి.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కు చెందిన ఆరుగురు ఈ రాక్షస సంస్థలో చేరేందుకు వెళుతూ దొరికిపోవటం తెలిసిందే. ఒక అంచనా ప్రకారం ఐఎస్ లో భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచి ఐఎస్ చేరుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉండటం కాస్తంత షాకింగ్ అంశంగా చెప్పాలి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మంది ఐఎస్ లో చేరితే వీరిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని తేల్చారు. కేరళ.. మహారాష్ట్రాలకు నలుగురు చొప్పున.. తమిళనాడుకు చెందిన ముగ్గరు.. జమ్మూకాశ్మీర్.. యూపీకి చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఐఎస్ లో చేరినట్లుగా చెబుతున్నారు. మానవత్వానికి మారుపేరుగా నిలిచే దేశంగా పేరున్న మన దేశం నుంచి రాక్షసులుగా మారేందుకు అంత ఆసక్తి వ్యక్తం కావటం ఆందోళన కలిగించే అంశమే.