ట్రంప్ కు థాంక్స్ చెబుతున్న టెర్రరిస్టులు

Update: 2017-01-30 09:17 GMT
ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థులతో పాటు ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌లే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేయడంపై టెర్రరిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట.  ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఐఎస్ ఐఎస్ తో పాటు ఇతర  జిహాదీ గ్రూపులు పండుగ చేసుకుంటున్నాయట. ట్రంప్‌ నిర్ణయం వల్ల ముస్లింలో ఆత్మ విమర్శ మొదలై వారంతా ఏకతాటిపైకి వస్తారని వారంటున్నారు. ఇలాంటి ఆర్డర్ పాస్ చేసిన ట్రంప్ కు వారు థాంక్స్ చెబుతున్నారట. ఐసిస్‌ అధికారిక వార్తాపత్రిక - అనధికారిక వెబ్‌ సైట్ లోనూ దీనికి సంబంధించి కథనాలు రాశారని.. ట్రంప్ నిర్ణయం తమకు మేలు చేస్తుందని వారు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
    
అమెరికా అధ్య‌క్షుడి నిర్ణయం వల్ల ఆ దేశంలోని ముస్లింలు, ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లే ముస్లింల మనసు కూడా మారుతుందని.. వారంతా జిహాదీలకు మద్దతు పలుకుతారని ఐసిస్ వెబ్ సైట్లో ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.  ట్రంప్‌ త్వరలోనే మిడిల్‌ ఈస్ట్‌ దేశాలపై యుద్ధానికి దిగుతారని కూడా ఐసిస్ భావిస్తోందట.  అంతేకాదు.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తరువాత  ఇక ఐఎస్ ఐఎస్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్ధాదీ దాక్కోవాల్సిన అవసరం లేదని ఆ ఉగ్ర సంస్థ‌ పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News