కరోనా సోకిన ఓ యువకుడు ఐసోలేషన్ కోసం చెట్టు మీద ఆవాసం ఏర్పరుచుకున్న విషయం అందరికీ తెల్సిందే. బీటెక్ చదివే ఆ యువకుడు 12 రోజులకే కరోనా నుంచి బయటపడ్డాడు. తన ఇంటి ముందు ఉన్న చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకొని నిర్బంధంలో ఉన్నాడు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివ. కాగా అతి తక్కువ సమయంలో వైరస్ ను జయించాడు. హైదరాబాద్లో బీటెక్ చదివే శివ సెలవుల కారణంగా ఊరికి వచ్చాడు.
ఇల్లు గడవడం కోసం ఉపాధి హామీ పనికి వెళ్లేవాడు శివ. ఈ నేపథ్యంలో అతడికి కరోనా సోకింది. పరీక్షల్లో వైరస్ నిర్ధరణ కాగానే ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు చెప్పారు. కానీ ఇంట్లో పరిస్థితి వేరుగా ఉంది. ఉన్నది ఒకే గది. నలుగురు కుటుంబ సభ్యులు. అందరితో కలిసి ఉంటే వారందరికీ మహమ్మారి సోకుతుందని ఆలోచించాడు.
కుటుంబ సభ్యులకు కరోనా రాకూడదని అనుకున్నాడు. అందుకే ఇంటి ముందు ఉన్న గానుగ చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకున్నాడు. తాడు సాయంతో ఆహారం, నీరు తీసుకుంటూ చెట్టుపై ఐసోలేషన్ లో ఉన్నాడు. ఇలా చెట్టుపై ఉంటూనే వైరస్ తో పోరాడాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో శివకు నెగిటివ్ అని తేలినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. శివ ధైర్యాన్ని వైద్యులు కొనియాడారు.
ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చెట్టుపై నివాసముండే కరోనా జయించిన శివ చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఓ వైపు ఐసోలేషన్ సదుపాయం లేని ఊరు... మరోవైపు ఇంట్లో ఒకే గది ఉండడం వల్ల కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో చెట్టుపై ఉండడానికి నిర్ణయించుకున్న శివ ఆలోచనను పలువురు కొనియాడారు. చెట్టు ఐసోలేషన్ ఎఫెక్ట్ నో లేక ఇతర కారణాల వల్లో శివ 12 రోజులకే కరోనా నుంచి విముక్తి పొందాడు.