బూస్టర్ డోస్ పై ఇజ్రాయెల్ సర్వే .. ఏం చెప్పారంటే ?

Update: 2021-08-24 05:31 GMT
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. తాజాగా కొత్త రకం వేరియంట్‌ డెల్టా ప్లస్‌ మరింత విజృంభిస్తోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో  డెల్టా కేసులు అధిక మొత్తంలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో  బూస్టర్ డోస్‌ అవసరమా, కాదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బూస్టర్ డోసు వల్ల మంచి జరుగుతుందని పదే పదే చెబుతున్నారు. కరోనా వైరస్ వేరియంట్లను తట్టుకోవాలంటే బూస్టర్ డోసు అవసరం పడుతోందని అంటున్నారు. చాలా దేశాలు బూస్టర్ డోసు అందిస్తున్నాయి.

అమెరికా, జ‌ర్మ‌నీ, కెన‌డా, ఫ్రాన్స్‌ దేశాలు బూస్ట‌ర్ డోసుల‌ను అందిస్తున్నాయి. బూస్టర్ డోస్ సామర్థ్యంపై ఇజ్రాయెల్ కొత్త అధ్యయనం నిర్వహించింది. అందులో బూస్టర్ డోసు సమర్థవంతంగా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందని వెల్లడైంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో కంటే మూడో డోసుతో నాలుగు రెట్లు ఎక్కువగా రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. ఇజ్రాయిల్‌ లో ఇటీవ‌ల అద‌న‌పు కోవిడ్ టీకాల‌ను అందించారు. మూడో డోసు ఫైజ‌ర్ టీకాతో 60 ఏళ్లు దాటిన వారిలో క‌రోనా ఇన్‌ ఫెక్ష‌న్ గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు గుర్తించారు. వ్యాక్సినేష‌న్ నిపుణుల క‌మిటీతో మంత్రిత్వ‌శాఖ భేటీ జరిగింది. డెల్టా వేరియంట్‌ ను నిరోధించేందుకు అమెరికాతోపాటు ప‌లు దేశాలు బూస్ట‌ర్ డోసుల‌ను ఇస్తున్నాయి.

బూస్ట‌ర్ డోసు వేసుకున్న 10 రోజుల త‌ర్వాత వైర‌స్ నుంచి రక్షణ అధికంగా స్థాయిలో ఉందని ఇజ్రాయెల్ అధికారులు నిర్వహించిన సర్వేలో  గుర్తించారు. రెండు డోసులు వేసుకున్నివారిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉందని అధ్యయనంలో తేలింద‌న్నారు. 60 ఏళ్ల వృద్ధులు, ఆపైబడిన వారిలో వైరస్ నుంచి రక్షణ స్థాయి అధికంగా ఉన్నట్టు గుర్తించారు. 60 ఏళ్లు దాటిన వారిలో 10 రోజుల్లో వైర‌స్ నుంచి ఆరు రెట్లు ర‌క్ష‌ణ పెరుగుతుందని అంచ‌నా వేశారు. అందులో భాగంగానే ఇజ్రాయిల్‌ లో జూలై 30వ తేదీ నుంచి మూడ‌వ డోసు అందించారు. బూస్ట‌ర్ డోసును 40ఏళ్లు దాటిన వారికి కూడా అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. రెండ‌వ డోసు తీసుకుని 5 నెల‌లు దాటిన‌వారికి మాత్ర‌మే మూడో బూస్టర్ డోసు అందిస్తున్నారు.

మహమ్మారిపై విజయం సాధించడానికి భారత్‌ లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 58,14,89,377 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు అధికారులు.. ఇందులో ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నవారు.. ఫస్ట్‌ మరియు సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలంటే మరికొంత సమయం పడుతుంది.. అయితే, ఇప్పుడు, ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ మాత్రమే కొనసాగుతోంది.. మరోవైపు బూస్టర్‌ డోస్ పై కూడా చర్చ సాగుతోంది. ఈ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా బూస్టర్‌ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బూస్టర్‌ డోస్‌ పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన డేటా లేదని స్పష్టం చేసిన డాక్టర్‌ గణదీప్ గులేరియా.. వచ్చే ఏడాది మొదటట్లో సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌ లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌ వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది.  ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News