అమెరికాలో లాక్ డౌన్ ఎత్తివేయాలని రెండు మూడు రోజులు గా ఆ దేశ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తుపాకులు చేత బట్టి కొందరు.. సామూహికంగా రోడ్లపైకి వచ్చి మరికొందరు.. అసలు సోషల్ డిస్టన్స్ పాటించకుండా ఒకరినొకరు తాకుతూ హగ్గులు చేసుకుంటూ కరోనా టైంలో చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు.. కానీ ఈ దేశ ప్రజలు మాత్రం కరోనా టైంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోషల్ డిస్టేన్స్’ నిరసన తెలిపి అబ్బురపరిచారు. రికార్డ్ సృష్టించారు. ఈ దేశ ప్రజల సామాజిక దూరం నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తినిస్తోంది.
పశ్చిమ ఆసియాలోని అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ క్రమశిక్షణ - టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు కూడా తమ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ డిస్టేన్స్ నిరసన తెలిపి వార్తల్లో నిలిచారు.
కరోనావైరస్ భయాల మధ్య ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు మరియు సామూహిక నిరసనలు.. ప్రజలు రోడ్లపైకి రావడం నిషేధించబడ్డాయి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ లో 2000 మందికి పైగా ప్రజలు తమ ప్రధాన మంత్రి నెతన్యాహుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ప్రధాని అప్రజాస్వామిక ప్రకటనలు చేస్తున్నారని.. ఆయన అవినీతికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ లోని రాబిన్ స్క్వేర్ వద్ద ప్రజలంతా చేరి వ్యక్తికి వ్యక్తికి మధ్య 6 అడుగుల దూరం పాటిస్తూ ఈ 'బ్లాక్ ఫ్లాగ్' నిరసన తెలిపారు. ప్రజలు సామాజిక దూర నియమాన్ని అందరూ పాటించడం ఈ నిరసనలో కనిపించింది.. 6 అడుగుల చొప్పున సర్కిల్స్ తీసుకొని ముసుగులు ధరించి మరీ ఈ నిరసన తెలుపడం విశేషం. వీరి సామాజిక దూరంతో చేసిన నిరసన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.