ఆంధ్రప్రదేశ్ నుంచి అంతరిక్షంలోకి భారతీయులు

Update: 2017-05-29 06:59 GMT
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అతిపెద్ద ప్రయోగానికి సిద్ధమైంది. తొలిసారిగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేస్తోంది. పూర్తి స్వదేశీ పరి జ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్‌ ద్వారా భారత గడ్డపై నుంచి భారతీయులను అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ రాకెట్‌ పేరు జీఎస్‌ ఎల్వీ ఎంకే-3. ఇప్పటివరకు తయారు చేసిన వాటిలో అతిపెద్ద రాకెట్‌ ఇదే.  ఈ స్థాయి ప్రయోగాలకు గతంలో ఇస్రో ఇతర దేశాలను ఆశ్రయించాల్సి వచ్చేది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత గడ్డనుంచి ఏపీలోని శ్రీహరికోట నుంచి జీఎస్‌ ఎల్వీ మార్క్‌-3ని ప్రయోగించనున్నారు.
    
అంతరిక్షంలోకి మనుషులను పంపగలిగే సామర్థ్యం ఈ ప్రయో గంతో విజయవంతమైతే ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్‌ నిలుస్తుంది. ఇప్పటికే రష్యా, అమెరికా, చైనా మానవసహిత రాకెట్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ తరఫున అంతరిక్షంలోకి మొట్టమొదట వెళ్లే అవకాశం మహిళా వ్యోమగామికే దక్కనున్నట్టు ఇస్రో చెప్తోంది. జీఎస్‌ ఎల్వీ మార్క్‌-3 ప్రయోగానికి శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు బిజీగా ఉన్నారు.
    
ఇది పూర్తి దేశీయంగా నిర్మించిన రాకెట్‌. ఈ రాకెట్‌ బరువు 640 టన్నులుంటుంది. లేదా పూర్తిగా లోడ్‌ చేసిన జంబోజెట్‌ విమానానికి ఐదు రె ట్ల బరువుంటుంది. ఇప్పటికే ఈ రాకెట్‌ను ప్రయోగ ప్రదేశానికి చేరవేశారు. ఈ కొత్త రాకెట్‌ నాలుగు టన్నుల ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News