చంద్రుడిపై హీలియం విలువ లెక్క ఎంతంటే?

Update: 2019-07-23 05:18 GMT
చంద‌మామ‌పై అత్యంత విలువైన హీలియం నిక్షేపాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఇంత‌కీ ఆ హీలియం లెక్క గురించి తెలిస్తే నోట మాట రాదంతే. చంద్రుడిపై హీలియం విలువ ఎంత‌?  ఎంత‌మేర నిక్షేపాలు ఉన్నాయి?  ఈ హీలియం నిక్షేపాల‌తో ఏం చేయొచ్చు? అన్న విష‌యానికి సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాలెన్నో ఉన్నాయి.

ఒక అంచ‌నా ప్ర‌కారం చంద‌మామ మీద హీలియం ఐసోటోప్ నిక్షేపాలు దాదాపు 10 ల‌క్ష‌ల ట‌న్నుల వ‌ర‌కు ఉన్న‌ట్లు చెబుతారు. హీలియం-3 నిక్షేపాన్ని భూమి మీద‌కు తీసుకురాగ‌లిగితే.. భూమి మీద ఉన్న అన్ని దేశాల ఇంధ‌న అవ‌స‌రాల‌ను దాదాపు 500 ఏళ్ల పాటు స‌రిపోయేలా చేసుకోవ‌చ్చు.

ఇక‌.. విలువ విష‌యానికి వ‌స్తే.. హీలియం ట‌న్ను విలువ 500 కోట్ల డాల‌ర్లు. అంటే.. మ‌న రూపాయిల్లో రూ.35వేల కోట్లు. ట‌న్ను విలువే ఇంత భారీగా ఉంటే.. 10 ల‌క్ష‌ల ట‌న్నులంటే దాని విలువ లెక్క వేయాలంటే మ‌న‌కు అందుబాటులో ఉండే క్యాలికులేట‌ర్లు ప‌ని చేయ‌వేమో. అంత భారీగా ఉండే.. ఈ హీలియం మీద ఏ దేశానికి గుత్తాధిప‌త్యం లేదు. కాబ‌ట్టి.. ఆ నిక్షేపాల్ని ఎవ‌రైనా తెచ్చుకునే వీలుంది.

కాకుంటే.. చంద్రుడి మీద‌కు వ్యోమ నౌక‌ల్ని దించే స‌త్తా ఉన్న దేశాలు ఇప్ప‌టివ‌ర‌కు మూడే. అవి.. అమెరికా.. ర‌ష్యా.. చైనా. ఇప్పుడు మ‌నం రేసులోకి వ‌చ్చాం. కాకుంటే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో అన్నింటికంటే చిత్ర‌మైన అంశం ఇంకొక‌టి ఉంది. చంద్రుడి మీద ఉన్న హీలియం నిక్షేపాల్లో అంతో ఇంతో భూమి మీద‌కు తెచ్చుకోగ‌లిగినా.. దాన్ని ఉప‌యోగించుకునే టెక్నాల‌జీ మ‌న ద‌గ్గ‌ర లేదు. ఇలాంటివేళ‌.. హీలియం నిక్షేపాలు.. దానిని భూమి మీద‌కు తెచ్చుకునే విష‌యంలో మ‌నం ఒక అడుగు ముందుకు వేసే నాటికి.. అగ్ర‌రాజ్యాలు ఆ హీలియం నిక్షేపాల్ని త‌మ వ‌ద్ద‌కు తెచ్చేసే ప్ర‌య‌త్నం చేసేస్తుంటాయేమో?
Tags:    

Similar News