ఒకేసారి పలు ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టటం ఇస్రోకి కొత్తేం కాదు. కానీ.. రికార్డు స్థాయిలో బరువున్న ఉపగ్రహాల్ని ఎలాంటి పొరపాటు దొర్లకుండా అనుకున్న సమయానికి.. అనుకున్న విధంగా నిర్ణిత లక్ష్యానికి తీసుకెళ్లి.. జూలై 10ని భారత అంతరిక్ష రంగంలో మరుపురాని రోజుగా మార్చారు. మిగిలిన ప్రయోగాలకు తాజా ప్రయోగానికి పెద్ద వ్యత్యాసమే ఉంది.
తాజా ప్రయోగం మొత్తంగా వ్యాపార సంబంధమైనది. విదేశాలకు చెందిన శాటిలైట్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. మరో విశేషం.. మొత్తం 1760 కిలోల బరువు ఉండే రాకెట్ (రాకెట్ బరువుతో పాటు.. అవి మోసుకెళ్లిన ఉపగ్రహాల బరువు కలిపి) అంతరిక్షంలోకి ప్రయోగించటం. ఇస్రో ప్రయోగించిన ఉప గ్రహాలన్నింటిలోకి తాజా ప్రయోగమే అత్యధిక బరువున్నది.
అధిక బరువున్న విదేశీ ఉప గ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టటం ద్వారా అంతరిక్ష రంగంలో ఇస్రో తనకున్న బలాన్ని తాజా ప్రయోగంతో ప్రపంచానికి చాటి చెప్పింది. శుక్రవారం రాత్రి 9.58 గంటలకు ఏపీలోని శ్రీహరికోట (నెల్లూరు జిల్లా)లోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించారు.
భారత్‌కు బాగా కలిసి వచ్చిన పీఎస్‌ఎల్‌వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) సిరీస్‌లోనే తాజా ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ 30 ప్రయోగాలు చేయగా.. మొదటి ప్రయోగం తప్పించి మిగిలినవన్నీ విజయవంతం అయ్యాయి.
తాజాగా ప్రయోగించిన ఉపగ్రహాలన్నీ విదేశీ సంస్థలకు చెందినవి. ఇవన్నీ భూ పరిశీలనకు ఉపయోగిస్తారు. అత్యధిక రిజల్యూషన్‌తో ఒకదాని వెనుక ఒకటి తిరుగుతూ ఫోటోల్ని తీస్తాయి. భూమిపై ఏ లక్ష్యాన్ని అయినా అవి చిత్రీకరించే సామర్థ్యం వీటికుంది. భూమిపై ఉన్న వనరులతో పాటు.. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయటానికి.. విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలకు తాజాగా ప్రయోగించిన ఉప గ్రహాలు సాయం చేస్తాయి.
తాజా ప్రయోగం విజయవంతం కావటంతో అంతరిక్ష రంగానికి సంబంధించి భారత్ తనకున్న శక్తి సామర్థ్యాల్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లు అయ్యింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు తమ ఉప గ్రహాల్ని భారత్ ద్వారా ప్రయోగించే అవకాశాలు మరింత పెరగనున్నాయి.