ఒక రాకెట్.. ఎన్నో స్పెషల్స్...

Update: 2017-02-15 05:29 GMT
పీఎస్ ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్.. ఈ ఉపగ్రహ వాహక నౌక భారత్ కు ముద్దుబిడ్డ అని చెప్పాలి. భారత ప్రతిష్ఠను భుజాన వేసుకుని గగన విహారం చేస్తోందని చెప్పాలి. ఎందుకంటే భారత్‌ కు ఎంతో నమ్మకమైన ఈ నౌక ద్వారా ఎన్నో విజయాలు సాధించాం. పీఎస్ ఎల్ వీతో ఇప్పటికి 39 ప్రయోగాలు చేశాం. ఈరోజు కూడా విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలతోపాటు భారతదేశానికి చెందిన మరో మూడు ఉపగ్రహాలను కలి పి 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి విజయవంతంగా పంపించారు.  ఇప్పటివరకు రష్యాకే పరిమితమైన రికార్డును భారత్‌ అధిగమించడంతోపాటు ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.  2014లో రష్యా ఒకే రాకెట్‌ ద్వారా 37 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. అలాగే 2013లో అమెరికా ఒకే రాకెట్‌ ద్వారా 29 ఉపగ్రహాల ప్రయోగం చేపట్టింది. గత ఏడాది జూన్‌ 24వ తేది మన ఇస్రో కూడా ఒకే రాకెట్‌ ద్వారా మొట్టమొదటిసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా గమ్యం చేర్చి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ తొలిసారిగా తన సత్తా చాటింది. అయితే అంతరిక్ష ప్రయోగరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో దూసుకువెళుతున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రయోశపెట్టేందుకు గత రెండు నెలలుగా ఏర్పాట్లు చేసి విజయం సాధించారు.
 
పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను దశలవారీగా కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి రావడంతో ఈ ప్రయోగాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

ఇస్రో ప్రయోగిస్తున్న ఉపగ్రహాల వివరాలు

* 714 కేలోల బరువు కలిగిన కార్టోశాట్‌-2డి ఉపగ్రహం

*  30 కేజీల బరువు కలిగిన నానో శాటిలైట్స్‌ (ఐఎన్‌ ఎస్‌-1ఎ)

* ఐఎన్‌ ఎస్‌-1బి భారత్‌ కు చెందిన సొంత ఉపగ్రహాలు

*  అమెరికాకు చెందిన 4.7 కేజీల బరువు కలిగిన డౌ-32 అనే 88 చిన్న ఉపగ్రహాలు

* స్విట్జర్లాండ్‌ కు చెందిన 4.6 కేజీల బరువు కలిగిన బైబో-2

* ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన 43 కేజీల బరువు కలిగిన క్లార్క్‌ శాట్‌

* కలిస్టాన్‌ దేశానికి చెందిన 1.7 కేజీల బరువు కలిగిన ఏ-1 ఉపగ్రహం

*  యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశానికి చెందిన 1.12 కేజీల బరువు కలిగిన ఉపగ్రహం

*  అమెరికాకు చెందిన ఎమోర్‌ అనే 4.5 కేజీల బరువు కలిగిన మరో 8 ఉపగ్రహాలు

* నెదర్లాండ్సుకు చెందిన 3 కేజీల బరువు కలిగిన మరో ఉపగ్రహం

 మొత్తం 1375 కేజీల బరువు కలిగిన 104 ఉపగ్రహాలను పీఎస్‌ ఎల్‌ వీ నౌక క్షేమంగా భూమికి 500 కిలోమీటర్ల నుంచి 630 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

పీఎస్‌ ఎల్‌ వీ రాకెట్‌ తో.. 39వ ప్రయోగం

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ ఎల్‌ వీ) రాకెట్‌ ఇస్రో కు అత్యంత నమ్మకమైన నౌక. ఇప్పటివరకు ఈ రాకెట్‌ ద్వారా 38 ప్రయోగాలు చేపట్టగా 37 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బుధవారం చేపట్టే ప్రయోగం 39వది. 320 టన్నుల బరువున్న రాకెట్‌ 1375 కేజీల బరువు కలిగిన 104 ఉపగ్రహాలను 4 దశల్లో నిర్ణీత కక్ష్యలోకి క్షేమంగా తీసుకువెళ్లనుంది. ఇప్పటివరకు భారత్‌ పీఎస్‌ ఎల్‌వీ ద్వారా 122 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగా అందులో స్వదేశానికి చెందినవి 43 ఉపగ్రహాలుకాగా విదేశాలకు చెందినవి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. అలాగే 1999 నుంచి ఇస్రో ఇప్పటివరకు 22 దేశాలకు చెందిన 79 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగా బుధవారం ఒకే ప్రయోగం ద్వారా ఒకే రాకెట్‌ లో 101 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతుంది.

రాకెట్‌ ప్రయోగం సాగిందిలా..

షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.  

* 44.4 మీటర్ల పొడవున్న రాకెట్‌ తనలో నింపిన 320 టన్నుల ఇంధన సహాయంతో 510 కిలోమీటర్ల ఎత్తు నుంచి దశలవారీగా 610 కిలోమీటర్ల ఎత్తులోపు 104 ఉపగ్రహాలను సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
 
* రాకెట్‌ మొదటి దశను 211.4 సెకన్లలో అధిగమించి 73.2 టన్నుల ఘన ఇంధన సాయంతో 714 కేజీల బరువున్న కార్టోశాట్‌ ను 510 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టింది.

* 2వ దశను 266.92 సెకన్లలో అధిగమించి 42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో ఐఎన్‌ ఎస్‌ 1ఏ ఉపగ్రహాన్ని, 492.22 సెకన్లలో 76 టన్నుల ఘన ఇంధన సాయంతో 510.610 కిలోమీటర్ల ఎత్తులో ఐఎన్‌ ఎస్‌ 2బీ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.

*  స్వదేశానికి చెందిన ఈ 3 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం పూర్తయ్యాక విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను 28.82 నిమిషాల సమయంలో దశలవారీగా 525 కిలోమీటర్ల ఎత్తు నుంచి 610 కిలోమీటర్ల ఎత్తులోపు ప్రవేశపెట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News