మాగుంట‌కు తిప్ప‌లు త‌ప్ప‌వా.. త‌ప్ప‌ని తేలితే.. ఇబ్బందే గురూ..!

Update: 2022-09-17 04:41 GMT
చేసుకున్న‌వారికి చేసుకున్నంత‌.. అన్న‌ట్టుగా.. మారిపోయింది.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప‌రిస్థితి. ఆది నుంచి కూడా లిక్క‌ర్ బిజినెస్‌లో ఉన్న మాగుంట ఫ్యామిలీ.. ప్ర‌స్తుతం  ఏపీలో మ‌ద్యం  విధానం బాగోలేద‌ని.. పోయి పోయి ఢిల్లీలోని ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపింది. అయితే. అక్క‌డ జ‌రిగిన భారీ స్కాంలో ఇప్పుడు మాగుంట ఇంట్లోనూ.. ఈడీ అధికారులు సోదా చేశారు. ఈ ప‌రిణామం.. ఆయ‌న‌కు రాజ‌కీయంగా కూడా ఇబ్బంది క‌లిగించేలా ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. ఢిల్లీ లిక్క‌ర్ కేసును కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్గా తీసుకుంటోం ది. అక్క‌డి కేజ్రీవాల్ స‌ర్కారును బోనులో పెట్టాల‌నేది.. మోడీ స‌ర్కారు వ్యూహం.

ఈ క్ర‌మంలో ఏ చిన్న‌ అవ‌కాశం  చిక్కినా.. వ‌దిలి పెట్టే అవ‌కాశం క‌నిపించడం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆఖ‌రికి మిత్ర‌ప‌క్షం పార్టీ స‌భ్యులు దొరికినా.. దానిని అడ్డుపెట్టుకుని.. కేజ్రీవాల్‌పై క‌సి తీర్చుకునేందుకు మోడీ రెడీ గా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో మాగుంట దొర‌క‌డం.. చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఈ కేసు క‌నుక‌.. ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటే. ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా.. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నా.. ఆయ‌నకు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు.

ఆయ‌న పార్టీ మార‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపించింది. అయితే.. దీనిని ఆయ‌న స్వ‌యంగా తోసిపుచ్చా రు. అయిన‌ప్ప‌టికీ.. మాగుంట మ‌న‌సు మాత్రం టీడీపీవైపు ఉంది. స‌రే.. ఈ పార్టీలో చేరాల‌ని అనుకున్నా.. రేపు ఈ పార్టీ కూడా.. మోడీకి చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ క్ర‌మంలో మాగుంటకు టీడీపీ డోర్లు కూడా మూసుకుపోయే ప‌రిస్తితి త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే..  మాగుంట ఈ కేసునుంచి ఎంత తొంద‌ర‌గా బ‌య‌ట‌కు వ‌స్తే..అంత మంచిద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. కానీ, ఇంత జ‌రిగినా.. అంటే.. ఈడీ శుక్ర‌వారం.. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు మాగుంట నివాసాల‌పై (హైద‌రాబాద్‌, నెల్లూరు, ఒంగోలు) దాడులు చేసినా.. ఒక్క‌రంటే ఒక్క వైసీపీ నాయ‌కులు కూడా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News