సాఫ్ట్ వేర్ రంగంలో కంపెనీలు ఉద్యోగాల ఎంపిక తీరును మార్చేసుకుంటున్నాయి. మామూలుగా అయితే బీటెక్ కళాశాలల్లో 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత కంపెనీలు నేరుగా కళాశాలలకు వెళ్ళి క్యాంపస్ సెలక్షన్లు చేయటం అందరికీ తెలిసిందే. ఆయా కంపెనీలు తమకు అవసరమైన విద్యార్ధులను 3వ సంవత్సరంలో క్యాంపసుల్లో ఎంపికచేసుకొని అపాయిట్మెంట్ లెటర్లు ఇచ్చేస్తాయి. విద్యార్ధులు తమ చదవు అయిపోగానే వెంటనే కంపెనీల్లో చేరిపోతారు.
అయితే ఇపుడు ట్రెండ్ మారిపోయింది. అదేమిటంటే విద్యార్ధులు రెండో సంవత్సరం అయిపోగానే విప్రో లాంటి కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ చేసేస్తున్నాయి. మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటున్న విద్యార్ధుల్లో తమకు కావాల్సిన విద్యార్ధులను కాలేజీల్లో ఎంపిక చేసేసుకుని అపాయిట్మెంట్ లెటర్లు ఇచ్చేస్తున్నాయి. పనిలోపనిగా సదరు విద్యార్ధుల నుండి తాము ఎలాంటి నైపుణ్యాలను ఆశిస్తున్నామనే విషయంలో కళాశాల యాజమాన్యంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
దీనివల్ల ఏమవుతోందంటే కంపెనీలు ఇవ్వాల్సిన శిక్షణను కళాశాలలే ఇప్పించేస్తున్నాయి. మామూలుగా అయితే ఉద్యోగంలో చేరిన వారికి కంపెనీలే ఆరుమాసాలో లేదా ఏడాదో శిక్షణ ఇప్పిస్తాయి. కొత్త పద్ధతిలో ఇక కంపెనీలు శిక్షణ ఇవ్వవు.
తాము ఇప్పించాల్సిన శిక్షణను విద్యార్ధులకు కళాశాల యాజమాన్యాలతోనే కళాశాలల్లోనే ఇప్పించేస్తున్నారు. దీనివల్ల కంపెనీలకు విలువైన కాలం+డబ్బు చాలా ఆదా అవుతున్నాయి. దీంతో కళాశాలలు ఎంపికైన విద్యార్ధుల జీతాల విషయంలో పట్టుబడుతున్నాయి.
ఎంపిక చేసుకున్న విద్యార్ధులకు కచ్చితంగా సూపర్ డ్రీమ్, డ్రీ ప్యాకేజీలనే ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. సూపర్ డ్రీమ్ అంటే ఏడాదికి రు. 12-18 లక్షల జీతం. డ్రీమ్ అంటే ఏడాకి రు. 8-12 లక్షల జీతమన్నమాట. ఎక్కువ ప్యాకేజీలు వస్తున్నాయంటే అది కళాశాలకు కూడా ప్లస్ పాయింటే కదా.
తమ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు అత్యధిక జీతాలు వస్తున్నాయని యాజమాన్యాలు విద్యార్ధులను ఆకర్షించవచ్చు. కంపెనీలకు అవసరమైన సూపర్ స్పెషలైజేషన్ అయిన సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అంశాల్లో కాలేజీ ఫ్యాకల్టీకి అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నాయి. అంటే ఇలు కాలేజీలు, అటు స్టాఫ్, స్టూడెంట్స్, చివరగా కంపెనీలు అందరు హ్యాపీయే అన్నమాట.