ఆఫీసుకు రామంటున్న ఐటీ ఉద్యోగులు

Update: 2022-10-17 05:25 GMT
కరోనా వైరస్  మొదటి ఎఫెక్ట్ ఐటీ ఉద్యోగులపై పడింది. మిగతా రంగాల్లోని వారి కంటే ముందుగా ఈ రంగానికి చెందిన ఉద్యోగులకు లాక్డౌన్ ప్రకటించారు. ఆ తరువాత వర్క్ ఫ్రం  హోం విధించారు. ఇంటి నుంచి ఆఫీసు కార్యాకలాపాలు సాగించాలని సూచించారు.

కరోనా తీవ్రత ఉండే అవకాశాలు ప్రస్తుతం లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఐటీ సంస్థలు కార్యాలయాల్లో పనిచేయాలని తమ ఉద్యోగులకు ఆదేశాలు పంపిస్తున్నాయి. మొదట్లో 50 శాతం మాత్రమే అనుమతించిన యాజమాన్యం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆఫీసుకు రావాలని అంటున్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయడానికి ఇష్టపడడం లేదు. తమకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తేనే కార్యాలయాలకు వస్తామని అంటున్నారు.

ఇక  టెక్ ఇండస్ట్రీలో మూన్ లైటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మూన్ లైటింగ్ అంటే వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్నారు. ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నారు. ఇది మోసమని..ఉద్యోగులు అంతా కంపెనీలకు రావాలని కంపెనీలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
 
ఇప్పటిదాకా వర్క్ ఫ్రం హోం చేసిన ఐటీ ఉద్యోగులను ఇక ఆఫీసులకు రమ్మంటున్నాయి కంపెనీలు. కానీ ఆ కంపెనీలను ఉద్యోగులు రివర్స్ లో భయపెడుతున్నారట.. ఆఫీసులకు రావాలని ఒత్తిడి చేస్తే  రాజీనామా చేస్తామని చెబుతున్నారట.. దాదాపు 88 శాతం ఉద్యోగులకు ఆఫీసులకు రమ్మని చెబితే ఉద్యోగాల నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నామని స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. దీంతో 46 శాతం మంది దాకా వర్కింగ్ మదర్స్ ఉండడం విశేషం.

ఈ విషయంపై సీఐఈఎల్ హెచ్ ఆర్ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.  వర్క్ ఫ్రం హోం కు బాగా అలవాటుపడిపోయిన ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడడం లేదు.  ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేయడంతో ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా మాకు ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుతున్నారు. హెల్త్ కు సంబంధించిన విషయంలో మాత్ర ప్రత్యేక కేర్ తీసుకోవాలని కోరుతున్నారు. అలా ఉంటేనే కార్యాలయాలకు వస్తామని డిమాండ్ చేస్తున్నారు.
 
ఈ సర్వేలో 80 నుంచి 90 శాతం మంది ఎక్కడి నుంచైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్యాలయలో పనిచేయాల్సి వస్తే తమ ఆలోచనలను పంచుకునే వేదికగా ఉండాలని కోరుతున్నారు. సమాచారాన్ని బదిలీ చేసుకునే హక్కు  కల్పించాలంటున్నారు. అలాగే ఆఫీసుల్లో మౌలిక సదుపాయాలు కచ్చితంగా ఉండాలని కోరుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News