ఐటీ పరిశ్రమలో ఇప్పుడు ‘ఫేక్’ ఉద్యోగులను ఏరివేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఎక్స్ పీరియన్స్ లెటర్స్ తో భారీ జీతాల్లో చేరిన వారి పనితనం ఆధారంగా.. పరిశీలన చేసి వారి గుట్టు తెలుసుకొని కంపెనీలు తొలగింపులు చేపడుతున్నాయి. ఇలా ఫేక్ లెటర్స్ తో ఉద్యోగాలు పొందిన చాలా మందిని ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ ‘యాక్సెంచర్’ ఇటీవల తొలగించింది. ఇప్పుడదే బాటలో మరో దిగ్గజ ఐటీ కంపెనీ ‘కాగ్నిజెంట్’ చేరింది. ఫేక్ డాక్యుమెంట్లతో ఉద్యోగాల్లో చేరిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను పెద్ద సంఖ్యలో బలవంతంగా తొలగించి కంపెనీ షాకిచ్చింది. అలాంటి వారిని కంపెనీ ఏమాత్రం ఊపేక్షించేది లేదని ఇండియా హెడ్ ప్రకటించారు.
నకిలీ పత్రాలు , నకిలీ అనుభవ లేఖలతో కాగ్నిజెంట్ ఇండియాలో చేరిన ఉద్యోగులను తొలగించారు. దాదాపు 6 శాతం మందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. కాగ్నిజెంట్ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ల పరిశీలన తర్వాత అధిక అసంకల్పిత పనితీరును అంచనావేసి ఈ తొలగింపులు చేపట్టినట్టు వివరించారు.
విఫలమైన పనితీరు, మూన్‌లైటింగ్ కారణంగా తొలగింపుల సంఖ్య గత కొన్ని నెలలుగా పెరిగింది. కంపెనీలు ఆఫీసు నుండి పనిని పునఃప్రారంభించడంతో నేపథ్య తనిఖీలు పెరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు మరిన్ని పెరగవచ్చని హెచ్చరిస్తున్నాయి.
ఇటీవల కాగ్నిజెంట్ కేసు వెలుగులోకి రాకముందే ఉద్యోగులు తమ కంపెనీలో కూడా నకిలీ పత్రాలతో చేరిన వారిని గుర్తించి యాక్సెంచర్ ఇండియా కూడా భారీ తొలగింపులను చేపట్టింది. "మా ఖాతాదారులకు సేవలందించే మా సామర్థ్యంపై ఎటువంటి ప్రభావం ఉండదని నిర్ధారించడానికి మేము ఈ కఠిన చర్య తీసుకున్నాము" అని పేర్కొంది.
అయితే, యాక్సెంచర్ ఇండియాలో ఈ తొలగింపుల నేపధ్యంలో క్వాలిఫైడ్ అభ్యర్థుల కోసం ప్రస్తుతం ఉన్న ఆఫర్‌లను నియమించించేందుకు రిక్రూట్ మెంట్ ను కొనసాగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆ తర్వాత నకిలీ డాక్యుమెంట్ల సహాయంతో ఉద్యోగాలు పొందే కేసులు పెరిగాయని చాలా మంది నిపుణులు విశ్వసిస్తున్నారు.
నకిలీ లేఖలు , నకిలీ పత్రాలతో ట్విట్టర్, మెటా మొదలైన ఇతర కంపెనీలలో కూడా భారీ తొలగింపులు జరిగాయి. కంపెనీలు ప్రాథమికంగా ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించినప్పటికీ, వారు కొద్దికాలంలోనే ఉద్యోగాలు కోల్పోవడంతో వేలాది మంది ఐటీ కార్మికులు రోడ్డున పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా ఫేక్ డాక్యుమెంట్లతో పెద్ద ఎత్తున ఐటీలో తొలగింపులపై ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. అవసరం తీరాక ఇలా ఏదో పేరు చెప్పి తొలగిస్తున్నారని వారంతా మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.