ప్రపంచంలోనే అత్యధిక మిలియనీర్లు ఉన్న నగరాలివే

Update: 2022-09-15 00:30 GMT
కోట్లకు పడగలెత్తే కోటీశ్వరులు కూడా ఎక్కడో ఒక చోట ఉండాల్సిందే. అయితే వారు ఉండేది ఖరీదైన నగరాల్లోనే.. ఆ నగరాల్లో ఎక్కువగా అమెరికావే ఉన్నాయి. అవి ఏంటి? ప్రపంచ మిలియనీర్లు అక్కడే ఎందుకు ఉంటున్నారన్న దానిపై ఆసక్తికర నివేదిక విడుదలైంది.

హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్రూప్ రూపొందించిన నివేదికలో సంపన్నులకు సంబంధించిన ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరుల్లో అత్యధికులు ఈ నగరాల్లోనే నివసిస్తున్నారట.. మిలియనీర్లతో ఆ నగరాలన్నీ కళకళలాడుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులు ఉన్న టాప్ 10 నగరాల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసిస్తున్నట్టు తేలింది. న్యూయార్క్ లో 3,45,600 మంది మిలియనీర్లు, 59 మంది బిలియనీర్లు ఉన్నట్టు వెల్లడైంది.

ఆ తర్వాత స్థానాల్లో జపాన్ లోని టోక్యో, శాన్ ఫ్రాన్సిస్ కో( అమెరికా), లండన్ నగరాలు ఉన్నాయి.

ఒక మిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆస్తులు కలిగి ఉన్న వారిని మిలియనీర్ ప్రాతిపదికగా తీసుకున్నారు. టాప్ 10లో సగం అమెరికా నగరాలే కావడం విశేషం.

సౌదీ అరేబియా రాజధాని రియాడ్, యూఏఈలోని షార్జా నగరాల్లో మిలియనీర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. ఈ వరుసగాలోనే అబుదాబి, దుబాయ్ కూడా ఉన్నాయి. తక్కువ పన్నులు, కొత్త నివాస విధానాలతో యూఏఈ సంపన్నులకు ఆకర్షిస్తోందని తేలింది. రష్యా ధనవంతులు యూఏఈకి భారీ ఎత్తున తరలివస్తుండడంతో ఇక్కడ శ్రీమంతుల సంఖ్య పెరుగుతోందని తేలింది.

మిలియనీర్లు ఉన్న టాప్ -10 నగరాలు ఇవే

1. న్యూయార్క్,

2. టోక్యో

3. శాన్ ఫ్రాన్సిస్ కో

4. లండన్

5.సింగపూర్

6. లాస్ ఏంజిల్స్

7.షికాగో

8. హ్యూస్టన్

9. బీజింగ్

10. షాంఘై

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News