గ్యాంగ్ స్టర్ నయీమ్‌ను హైదరాబాద్ పోలీసులు మట్టుబెట్టి ఏడాది దాటిపోయింది. అయినా కూడా నయీమ్ బంధువులు నానా చిక్కులు ఎదుర్కొంటున్నారు. 2016 ఆగస్టు లో నయీమ్‌ను హైదరాబాద్ పోలీసులు మట్టు బెట్టారు. రాజకీయ నేతలకు, అధికారులకు కూడా తీవ్ర కంటకంగా మారి చివరికి నేతలకే సవాల్ రువ్వే రేంజ్‌కు ఎదిగిన నయీమ్‌ను పోలీసులు పకడ్బందీగా ఎన్‌కౌంటర్ చేశారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికీ విచారణ సాగుతూనే ఉంది. గతంలో అనేక మంది నేతలు తమ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు నయీమ్‌కు బానిసలుగా మారానని, కీలుబొమ్మలుగా నయీమ్ చెప్పినట్టు వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక, తన ఆగడాలు, దౌర్జన్యాలతో నయీమ్ సంపాయించిన ఆస్తికి కొదవే లేదని సమాచారం. హైదరాబాద్‌లోని రెండు అపార్టు మెంట్ల నుంచి నయీమ్‌కు చెందిన నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలను పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న విషయం అప్పట్లోనే పెను సంచలనమైంది. అదేవిధంగా ఆయన తన తల్లి, సోదరులతో సంబంధాలు తెంచుకుని వచ్చేసినా.. తాను సంపాయించిన అక్రమ ఆస్తులను మాత్రం వారి పేరుతోనే ఉంచేయడం ఇప్పుడు మరింత వివాదానికి దారితీస్తోంది. భారీ ఎత్తున కూడగట్టిన ఆస్తులను, పొలాలను నయీమ్ తన కుటుంబం పేరుతో పెట్టడం సంచలనం సృష్టించింది.
ఈ క్రమంలో నయీమ్ చచ్చిపోయినా.. అతను కూడగట్టిన అక్రమ సంపాదన మాత్రం అతని బంధువులను విడిచిపెట్టడం లేదు. నయీమ్ కుటుంబ సభ్యులకు ఐటీశాఖ తాజాగా రెండోసారి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరిజిల్లా కేంద్రం ఖిలానగర్‌లో గల నయీమ్ తల్లి తాహేరాబేగం - భార్య హసీనా బేగం - అక్క సలీమా బేగం - తమ్ముడు కూతురు అహేలా బేగంకు షోకాజు నోటీసులు జారీ చేస్తూ వారి ఇంటికి అతికించారు. భారీ స్థాయిలో ఉన్న ఈ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆదాయం ఎలా సమకూరిందో తెలపాలని పేర్కొన్నారు. డిసెంబర్ 11లోగా సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో మిమ్మల్ని నయీమ్ బినామీలుగా గుర్తించి బినామీ ఆస్తుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ విభాగం డిప్యూటీ కమిషనర్ బ్రజేంద్రకుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడా కుటుంబం హడలి పోతోందని సమాచారం. సో.. నయీమ్ పోయిన నయీమ్ చేసిన పాపాలు మాత్రం వెంటాడుతున్నాయి.