ఆ మంత్రి ఇంట్లో దొరికిన కోట్లు.. గోల్డ్ తో షాక్

Update: 2017-01-23 16:08 GMT
పెద్ద నోట్లను రద్దు చేస్తే చాలు.. నల్లధనానికి చెక్ చెప్పినట్లే అంటూ ప్రధాని మోడీ చెప్పిన మాటలు ఎంత ఎటకారమన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసేందుకే పెద్దనోట్ల రద్దు నిర్ణయం పనికి వస్తుందంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది. నిజంగా దాని వల్ల జరిగిన ప్రయోజనం ఎంతన్నది అటు రిజర్వ్ బ్యాంక్ కానీ.. కేంద్ర ఆర్థిక మంత్రి కానీ నోరు విప్పటం లేదు.

మరోవైపు.. అధికారం చేతిలో ఉంటే చాలు.. నోట్ల కట్టలు నాయకుల ఇళ్లకు నడుచుకుంటూ వస్తాయన్న మాటల్ని నిజం చేసేలా మేటలు వేసిన నల్లధనం తాజాగా దొరికేసింది. కర్ణాటకలోని ఒక మంత్రి ఇంట్లో దొరికిన వందల కోట్లు చూసి అధికారులు సైతం నోరెళ్లబెట్టేస్తున్నారు. అయ్యగారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టల లెక్క తేల్చేసరికి కళ్లకే కాదు.. చేతులు కూడా నొప్పులు పుట్టినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. దొరికింది అంత భారీ మొత్తం మరి.

కర్ణాటక మంత్రిగా పని చేస్తున్న సతీశ్ జర్కీహోలీ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆయన యవ్వారంపై క్షుణ్ణంగా వివరాలు సేకరించిన అధికారులు.. సోమవారం ఆయన ఇంటితోపాటు.. ఆయన బంధువులు.. స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు.

ఈ సందర్భంగా ఆయన నుంచి 12 కేజీల బంగారంతో పాటు.. రూ.112కోట్ల నగదును గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో కొత్త నోట్ల కట్టలు బయటపడటంతో ఐటీ అధికారుల నోట మాట రాని పరిస్థితి. ఒక మంత్రి ఇంట్లోనే దొరికిన నగదే ఇంత భారీగా ఉంటే.. స్థిర.. చరాస్తుల రూపంలో మరెంత సంపదను పోగేశారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News