ఆదాయపు పన్ను అధికారుల దాడులతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ పార్టీ నాయకుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని వారి నివాసాలతో పాటు తెలంగాణ హైదరాబాద్ లోని వారి నివాసాలు, వారి కార్యాలయాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. వైఎస్సార్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి నివాసంలో గురువారం తెల్లవారుజామున అధికారులు దాడులు చేశారు. 10మందితో కూడిన అధికారుల బృందం కడప ద్వారకనగర్ లోని శ్రీనివాసుల రెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. తలుపులు మూసివేసి ఎవరినీ లోపలికి రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, రికార్డులు, దస్త్రాలు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంతో పాటు పంజగుట్ట లోని ఆయనకు చెందిన ఆర్.కె.ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. శ్రీనివాసుల రెడ్డి కాంట్రాక్టర్ గా కొనసాగుతున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక తదితర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. పన్ను ఎగవేతకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అధికారులు దాడులు చేశారా? లేదా గత టీడీపీ ప్రభుత్వంలో అప్పనంగా ఏమైనా లబ్ధి పొందారా అని వివరాలు తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేశారు. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసుల రెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన పత్రాలను ఐటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగవేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏమేరకు పన్ను ఎగవేశారన్నది సోదాల్లో తేలనుంది.