ఆర్య‌న్ ఖాన్ కేసులోనూ కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టారా?

Update: 2021-12-24 07:33 GMT
బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ ఆరోప‌ణల‌ నేప‌థ్యంలో అరెస్ట్ అవ్వ‌డం..బెయిల్ పై రిలీజ్ అవ్వ‌డం గురించి తెలిసిందే. ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్ త‌ర్వాత పోలీసులు..సిట్ అధికారులు పెద్ద హైడ్రామానే న‌డిపారు. విచార‌ణ పేరుతో ఆర్య‌న్ ఖాన్ ని అన్ని కోణాల్లో వించారించారు.

కోర్టు ష‌రతుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసినా అప్పుడ‌ప్పుడు విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల్సి వ‌చ్చేది. అయితే ఈ కేసులో ఎన్.సి.బి చివ‌రికి కొండ‌ని త‌వ్వి ఎలుకను ప‌ట్టుకున్న‌ట్లే అనిపిస్తోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా విచార‌ణ‌ని తాత‌త్కాలికంగా నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్ప‌టివవ‌ర‌కూ 20 మందిని విచారించారు. విచార‌ణ‌లో భాగంగా హైద‌రాబాద్ పోలీసుల్ని సైతం రంగంలోకి దించారు. అయితే విచార‌ణ‌లో ఉండ‌గా ఆర్య‌న్ ఖాన్ తో కుమ్మ‌క్కై బెయిల్ కి 25 కోట్ల వ‌ర‌కూ డిమాండ్ చేసినట్లు కొంత మంది పోలీసు అధికారుల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి.

కేసులో స్వ‌తంత్ర సాక్షి అయిన ప్ర‌భాక‌ర్ సెయిల్..ముంబై జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాఖండే..ఎన్ సీబీ అధికారులు స‌హా కొంత మంది పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ విచార‌ణ‌కు జ‌న‌ర‌ల్ జ్ఞానేశ్వ‌ర్ సింగ్ విజిలెన్స్ విచార‌ణ‌కు నేతృత్వం వ‌హించారు. అయితే ఇప్పుడు ఈ కేసు మొత్తం దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తోంది.

అక్టోబ‌ర్ 28న ఆర్య‌న్ ఖాన్ కి బెయిల్ దొరికింది. ప్ర‌తీ శుక్ర‌వారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సౌత్ ముంబై కార్యాల‌యానికి హాజ‌ర‌వ్వాల‌ని అదేశాలిచ్చింది. అయితే తాజాగా బాంబే హైకోర్టు ఈ హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. ఎన్ సీబీ అధికారుల ముందు హ‌జ‌రు కావాల్సిన ప‌నిలేద‌ని..కేసులో ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన సాక్ష్యాలు కూడా దొర‌క‌లేద‌ని జ‌స్టిస్ ఎన్ డ‌బ్ల్యూ సాంబ్రేతో కూడిన బెంచ్ పేర్కొంది. దీంతో ఆర్య‌న్ ఖాన్ కి మ‌రింత ఊర‌ట ల‌భించింది. అయితే దీనిపై అధికారులు అప్పీల్ కి వెళ్లే అవ‌కాశం ఉంది.

కింగ్ ఖాన్ క‌ల‌త‌తోనే నెల‌రోజులు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ముద్దుల త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు పాల‌వ్వ‌గా... కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించ‌డంతో ఆర్య‌న్ కి జైలు జీవితం త‌ప్ప‌లేదు. బెయిల్ పిటిష‌న్ ని కోర్టు కొట్టేయ‌డంతో షారుక్ తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో షారుక్ కి బాస‌ట‌గా హృతిక్ రోష‌న్..స‌ల్మాన్ ఖాన్ నిలిచారు. దైర్యంగా ఉండ‌మ‌ని మ‌నోధైర్యాన్ని ఇచ్చారు. ఇంకొంత మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు మౌనం వ‌హించ‌డం షారుక్ ని మ‌రింత కృంగ‌దీసిన‌ట్లు అయింది.

ప‌రిశ్ర‌మ త‌రుపు నుంచి ఎవ‌రి అభిప్రాయాలు వారు వెల్ల‌డించినా...షారుక్ కి బాగా తెలిసిన వారు సైతం మౌనంగా ఉండ‌టంతో ఆయ‌న మ‌రింత క్షోభ‌కు గుర‌య్యార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆర్యన్ అరెస్ట్ వెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయా? లేక నిజంగా డ్ర‌గ్స్ కేసులో దొరికాడా? అని కూడా అనుమ‌నాం వ్య‌క్తం అయ్యింది. ఆ రీజ‌న్స్ ఎలా ఉన్నా ఆర్య‌న్ జీవితం మాత్రం ఒక్క‌సారిగా త‌ల్ల‌కిందులైంది. దీంతో షారుక్ కి తండ్రిగా తీవ్ర మ‌నస్థాపానికి గుర‌య్యారు.

కంటి మీద కునుకు అన్న‌దే లేకుండా నిత్ర‌లేని రాత్రుల‌ను గ‌డిపారు. షారుక్ ని ఇంత‌లోనే ప్ర‌ఖ్యాత `బైజూస్` సంస్థ త‌మ ప్ర‌చార క‌ర్త‌ను తొల‌గించ‌డం సంచ‌లన‌మైంది. త‌న‌యుడు చేసిన త‌ప్పుకి తండ్రి కి శిక్ష‌ప‌డిన‌ట్లు అయింది. షారుక్ బ్రాండ్ వ్యాల్యూ పై త‌న‌యుడి జైలు జీవితం తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో షారుక్ సినిమాల‌న్ని వాయిదా వేసుకున్నారు.

శ‌త్రువుల‌కు దొరికిపోయిన ఖాన్

ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ సేవిస్తూ ఎన్.సి.బికి ప‌ట్టుబ‌డ‌డంతో ఈ వ్య‌వ‌హారం శ‌త్రువుల‌కు అలుసైపోతోంది. ముఖ్యంగా ఖాన్ లు అంటే అంతెత్తున ఎగిరి ప‌డే కంగ‌న క‌త్తి దూసింది. షారూక్ ఖాన్ జ‌రిగిన దానికి సారీ చెప్ప‌డా? అంటూ ప్ర‌శ్నిస్తోంది. కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి షారూఖ్ పై కంగ‌న‌ పరోక్షంగా మండిపడ్డారు. మాదకద్రవ్యాల కేసులో తన కుమారుడిని అరెస్ట్ చేసిన తర్వాత చైనీస్ స్టార్ జాకీ చాన్ ఎలా క్షమాపణలు చెప్పారో వివ‌రించిన కంగ‌న‌.. కొడుకుని రక్షించడానికి జాకీచాన్ నిరాకరించార‌ని ఖాన్ ని ఎద్దేవా చేసింది.
Tags:    

Similar News